మరో ప్రముఖ నటి సూసైడ్, కలకలం రేపుతోన్న ఆత్మహత్యలు!
దేశ వ్యాప్తంగా సినీ, టీవీ నటుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సుశాంత్ సూసైడ్ ఘటన మరువక ముందే.. మరో ముంబై సినీ, సీరియల్ నటి ఆత్మహత్య చేసుకుంది. అనుపమ పాథక్(40) అనే నటి దహిసర్‌లోని తన నివాసంలో..
దేశ వ్యాప్తంగా సినీ, టీవీ నటుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సుశాంత్ సూసైడ్ ఘటన మరువక ముందే.. మరో ముంబై సినీ, సీరియల్ నటి ఆత్మహత్య చేసుకుంది. అనుపమ పాథక్(40) అనే నటి దహిసర్‌లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడించింది. పలు సినిమాల్లో, సీరియల్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనుపమ పాథక్. అలాగే సోషల్ మీడియాలో కూడా ఆమె ఎక్కువగా యాక్టీవ్‌గా ఉండేది. కాగా అనుపమ సూసైడ్ చేసుకునే ఒక రోజు ముందు ఫేస్ బుక్ లైవ్ ఇచ్చింది. ఆ లైవ్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ లోకంలో ఎవరినీ నమ్మవద్దని,ప్రజలు స్వార్థపరులని పేర్కొంది. బీహార్‌లోని పూర్నియా జిల్లాకు చెందిన అనుపమ.. ముంబైలో ఉంటుంది. కాగా ఈ ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
Read More:
అరకులో నేటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్
ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు సతీమణి మృతి
కొత్తగా 13 మంది సబ్ కలెక్టర్‌లను నియమించిన ఏపీ ప్రభుత్వం