చేతబడి నెపం.. 80 ఏళ్ల వృద్ధుడిని సజీవ సమాధి చేసిన బంధువులు

మేఘాలయలో దారుణం జరిగింది. క్షుద్రపూజలు చేస్తున్నాడన్న నెపంతో 80 ఏళ్ల వృద్ధుడిని సజీవ సమాధి చేశారు బంధువులు

చేతబడి నెపం.. 80 ఏళ్ల వృద్ధుడిని సజీవ సమాధి చేసిన బంధువులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 14, 2020 | 2:45 PM

Old man buried alive: మేఘాలయలో దారుణం జరిగింది. క్షుద్రపూజలు చేస్తున్నాడన్న నెపంతో 80 ఏళ్ల వృద్ధుడిని సజీవ సమాధి చేశారు బంధువులు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి, ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వృద్ధుడి మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు

వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ ఖాసీ హిల్స్‌ ప్రాంతానికి చెందిన మోరిస్ మారంగర్ అనే వృద్ధుడిని ఈ నెల 7న అతడి బంధువులు బలవంతంగా ఇంటి నుంచి తీసుకెళ్లారు. అతడు చేతబడి చేస్తున్నానంటూ ఒకచోటికి తీసుకెళ్లి కాళ్లు, చేతులు కట్టేసి బతికుండగానే పాతిపెట్టారు. అయితే తమ తండ్రి ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో వృద్ధుడి పిల్లలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో దర్యాప్తు జరిపిన పోలీసులు ఆ వృద్ధుడి మేనల్లుళ్లు డేనియల్, జేల్స్‌, డిఫర్‌వెల్‌లను అరెస్ట్ చేశారు. మరుసటి రోజు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా తమ కుటుంబ సభ్యులపై మోరిస్ చేతబడి చేశాడని ప్రధాన నిందితులైన మేనల్లుళ్లు ఆరోపిస్తున్నారు. తమ ఇంట్లో సోదరిపై చేతబడి చేశాడని, మోరిస్ మరణించిన తరువాత ఆమె కోలుకుందని వారు చెబుతున్నారు. ఇక ఈ కేసును మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More:

Sushant Case: ఆ గ్లాస్ ఎందుకు భద్రపర్చలేదు: స్వామి అనుమానాలు

ఆ బయోపిక్‌లో రానా నటించడం లేదట