కొడుకును అమ్మేసి డబ్బులు పంచుకున్న తల్లిదండ్రులు

కంటికి రెప్పలా కాపాడుకోవల్సిన తల్లిదండ్రులే ఆ పిల్లాడిపాలిట శాపంగా మారారు. కానీ ఓ జంట బిడ్డను అంగడిలో సరుకులా పొరుగువారికి అమ్మేసి భార్య, భర్త తలోదారి చూసుకున్నారు.

కొడుకును అమ్మేసి డబ్బులు పంచుకున్న తల్లిదండ్రులు
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 13, 2020 | 6:09 PM

కంటికి రెప్పలా కాపాడుకోవల్సిన తల్లిదండ్రులే ఆ పిల్లాడిపాలిట శాపంగా మారారు. కానీ ఓ జంట బిడ్డను అంగడిలో సరుకులా పొరుగువారికి అమ్మేసి భార్య, భర్త తలోదారి చూసుకున్నారు. వచ్చిన డబ్బులను సమంగా పంచుకుని సరదాలకు చెక్కేశారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో ఈ వింత ఘటన వెలుగు చూసింది.

మథిలి మండలం కియాంగ్ తేలగబేజా గ్రామానికి చెందిన ఓ దంపతుల మధ్య తరుచు గొడవులు జరుగుతుండేవి. ఇదే క్రమంలో గొడవలు తారాస్థాయికి చేరి విడిపోవాలని అనుకున్నారు. కానీ అప్పటికే వారికి తొమ్మిదేళ్ల కొడుకు ఉండటంతో అదే గ్రామానికి చెందిన వారికి విక్రయించి వెళ్లిపోయారు. అయితే. అప్పటి నుంచి అతడికి సవతి తల్లి వేధింపులు మొదలయ్యాయి. కొనుక్కున్న కుటుంబం అతన్ని ప్రతి రోజూ పశువుల కాసేందుకు పంపించి తిండి సరిగా పెట్టక సాధించుకు తిన్నారు. చెబితే వినలేదని చిత్రహింసలకు గురిచేశారు. దీంతో వారి వేధింపులు భరించలేక తప్పించుకొని సలపదర్ గ్రామానికి పారిపోయాడు. అక్కడ బాలుడు వాసుదేవ్ కథ విన్న గ్రామస్థులు అంగన్‌వాడీ కేంద్రానికి అప్పగించారు. స్థానికులు సమాచారం మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. అతన్ని బాలల సదనానికి పంపించారు.