Mancherial Road accident: మంచిర్యాలలో రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన లారీ.. దంపతులు మృతి

Mancherial Road accident:  బైక్‌ను ఢీకొట్టిన లారీ.. దంపతులు దుర్మరణంరోజురోజుకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలు అజాగ్రత్తగా నడపడం, మద్యం తాగి నడపడం...

  • Subhash Goud
  • Publish Date - 4:23 pm, Mon, 18 January 21
Mancherial Road accident: మంచిర్యాలలో రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన లారీ.. దంపతులు మృతి

Mancherial Road accident: రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. వాహనాలు అజాగ్రత్తగా నడపడం, మద్యం తాగి నడపడం, నిర్లక్ష్యం తదితర కారణాల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలతో అమాయకులు బలయవుతున్నారు. బయటకు వెళ్తే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ హోమ్‌ ఫీల్డ్‌ పరిశ్రమ సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన ఓ లారీ దంపతులు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి డీసీపీ ఉదయ్‌ కుమార్‌, పట్టణ సీఐ వినోద్‌లు చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Also Read:

Brutal Murder in Prakasam: యువకుడి దారుణ హత్య.. గొంతు కోసి చంపేశారు.. ఘటనకు సంబంధించి కారణాలు ఇలా..