విజయనగరం జిల్లాలో యువకుల ఓవరాక్షన్.. తప్పును ప్రశ్నించిన ఎస్సైపై దాడి.. షాకింగ్ వీడియో

విజయనగరం జిల్లాలో యువకుల ఓవరాక్షన్.. తప్పును ప్రశ్నించిన ఎస్సైపై దాడి.. షాకింగ్ వీడియో

రూల్స్ బ్రేక్ చేశారు. ప్రశ్నిస్తే.. రౌడీయిజం ప్రదర్శించారు. ఏ మాత్రం విచక్షణ, బాధ్యత లేకుండా నడిరోడ్డుపై ఓ పోలీస్ అధికారిని ముగ్గురు యువకులు చితకబాదారు

Ram Naramaneni

|

Jan 18, 2021 | 4:30 PM

రూల్స్ బ్రేక్ చేశారు. ప్రశ్నిస్తే.. రౌడీయిజం ప్రదర్శించారు. ఏ మాత్రం విచక్షణ, బాధ్యత లేకుండా నడిరోడ్డుపై ఓ పోలీస్ అధికారిని ముగ్గురు యువకులు చితకబాదారు. విజయనగరం జిల్లాలో ఈ ఘటన జరిగింది.

శివన్నపేటలోని అత్తగారింటికి వెళ్లిన పాచిపెంట ఎస్సై రమణ.. సివిల్ డ్రెస్‌లో తిరిగి బయల్దేరారు. ఈ క్రమంలో ఖడ్గవలస వద్ద బైక్‌పై యువకులు ట్రిపుల్ రైడింగ్ చేయడంతో పాటు వేగంగా వెళ్తుండగా వారిని వద్దని వారించినందుకు యువకులు ఎస్సైపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడిలో ఎస్సైకు స్పల్ప గాయాలయ్యాయి. ఆయన షర్ట్ కూడా పూర్తిగా చిరిగిపోయింది. పోలీస్ అధికారిపై దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పాచిపెంట పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తమదైన స్టైల్లో విచారణ మొదలుపెట్టారు.

Also Read: ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. హాజరు విషయంలో ఒత్తిడి ఉండదు.. స్పష్టం చేసిన మంత్రి సబితా

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu