Crime News: కసాయి తండ్రి.. కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని అఘాయిత్యం.. ఆ తర్వాత గొంతు కోసి..

Man rapes and kills daughter: కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని.. కసాయి తండ్రి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను చంపి అడవిలో పడేశాడు. ఈ దారుణ సంఘటన

Crime News: కసాయి తండ్రి.. కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని అఘాయిత్యం.. ఆ తర్వాత గొంతు కోసి..
Crime News
Follow us

|

Updated on: Nov 17, 2021 | 10:37 AM

Man rapes and kills daughter: కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని.. కసాయి తండ్రి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను చంపి అడవిలో పడేశాడు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ జిల్లాలో చోటుచేసుకుంది. భోపాల్ జిల్లాలోని రాతిబాద్‌ గ్రామంలో 55 ఏళ్ల వ్యక్తి కుమార్తె ఏడాది క్రితం వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో ఆమెపై కోపంతో ఉన్న కన్నతండ్రే కసాయిగా మారి.. కుమార్తెపై అత్యాచారం చేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. కులాంతర వివాహం తరువాత సెహోర్ జిల్లాలోని బిల్కిస్‌గంజ్‌లో నివసిస్తున్న ఓ మహిళ.. ఏడాది క్రితం తన తల్లిదండ్రులను కాదని వేరే యువకుడిని కులాంతర వివాహం చేసుకుంది. కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడంతో.. గ్రామస్థులు, ఆ కులం వర్గాలకు సంబంధించిన బంధువులు అతన్ని అవహేళన చేశారు.

అప్పటినుంచి తండ్రి కుమార్తెపై కోపంతో రగిలిపోతున్నాడు. ఈ క్రమంలో కుమార్తెకు బిడ్డ పుట్టడంతో.. శిశువును తీసుకొని దీపావళి పండుగకు తన అక్క ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో అక్క ఇంట్లో ఉండగానే శిశువు అనారోగ్యంతో మరణించింది. అయితే.. సమాచారంతో శిశువు అంత్యక్రియల కోసం తండ్రి కొడుకుతో కలిసి రాతిబాద్ గ్రామానికి వచ్చాడు. అనంతరం శిశువు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు.. తండ్రి కుమార్తెను తీసుకొని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. ఈ సమయంలో కులాంతర వివాహంపై తండ్రీ కూతుళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కసాయిగా మారిన తండ్రి కన్న కుమార్తెపైనే అత్యాచారం చేసి, ఆపై ఆమె గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

రెండు రోజుల అనంతరం సమస్‌ఘడ్ అడవుల్లో మహిళ, శిశువు మృతదేహాలు పోలీసులకు లభ్యమయ్యాయి. అనుమానంతో బాధితురాలి తండ్రిని ప్రశ్నించగా.. ఈ నేరాన్ని తండ్రి అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. రెండు వారాల క్రితం జరిగిన ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు రాతిబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సుదేష్ తివారీ వెల్లడించారు. దీంతో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302, 376ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

India Corona: గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు.. 527 రోజుల కనిష్టానికి చేరిక..

Minister: విమానంలో ప్రయాణీకుడికి స్వయంగా వైద్యం చేసి ప్రాణం నిలబెట్టిన కేంద్ర మంత్రి.. సోషల్ మీడియాలో ప్రశంసలు!