Crime News: దారుణం.. వాటి కోసం ఏకంగా మహిళ పాదాలు నరికి చంపిన దుర్మార్గుడు..
Rajasthan Shocker: రాజస్తాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వెండి కడియాల కోసం ఓ కిరాతకుడు మహిళ కాళ్లు నరికి చంపాడు. ఈ ఘటన రాజ్ సమంద్ జిల్లాలోని
Rajasthan Shocker: రాజస్తాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వెండి కడియాల కోసం ఓ కిరాతకుడు మహిళ కాళ్లు నరికి చంపాడు. ఈ ఘటన రాజ్ సమంద్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. రాజ్‌సమంద్ జిల్లా చార్‌భుజా పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగిన ఈ ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలపిన వివరాల ప్రకారం.. పొలంలో 45 ఏళ్ల కుంకుబాయి అనే మహిళ మృతదేహాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. రెండు పాదాలు కూడా నరికి వేశారని.. పోలీసులు తెలిపారు. మహిళ ధరించిన వెండి కడియాలను దొంగిలించేందుకు ఓ దొంగ ఆమె పాదాలను నరికి చంపినట్లు చార్భుజా పోలీసులు తెలిపారు. నిందితులు మొదటగా మహిళ మెడపై కత్తితో దాడి చేశారని, ఆ తర్వాత కాళ్లు నరికారని.. దీంతో మహిళ మృతి చెందిందని రాజ్‌సమంద్ ఎస్పీ శివలాల్ తెలిపారు. కంకుబాయిగా పొలంలో పనిచేస్తున్న తన భర్త కోసం ఇంటి నుంచి భోజనం తీసుకొని వస్తుండగా ఈ హత్య జరిగినట్లు వెల్లడించారు.
భర్తకు భోజనం తీసుకెళ్లిన మహిళ పొలానికి చేరుకోలేదు. దీంతో భర్త ఇంటికి తిరిగి వచ్చి అతను పిల్లలను అడగ్గా.. ఆమె ఉదయాన్నే పొలానికి భోజనం తీసుకొని వచ్చినట్లు తెలిపారు. దీంతో బంధువులు, స్థానికులు గాలించగా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత ఆమె మృతదేహం పొలంలో కనిపించినట్లు పోలీసులు తెలిపారు. మహిళను కిరాతకంగా హత్య చేసి కడియాలను దొంగలించిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ శివలాల్ తెలిపారు. గతంలో కూడా ఓ మహిళ పాదాలు నరికి చంపిన ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జైపూర్‌లో పొలంలో పశువులు మేపేందుకు వెళ్లిన ఓ మహిళ దాడి చేసిన దొంగలు.. ఆమె పాదాలను నరికి వెండి కడియాలను తీసుకెళ్లారు.
Also Read: