AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guns on Road: దడ పుట్టిస్తోన్న గన్‌ కల్చర్‌.. ఇది అమెరికాలో కాదు.. మరెక్కడో తెలుసా..

Man arrested with 12 guns: గన్‌ కల్చర్‌ దడ పుట్టిస్తోంది. అమెరికానే కాదు.. భారత్‌లోనూ గన్‌ సంస్కృతి విస్తరిస్తోంది. హర్యానాలో ఏకంగా రోడ్లపై గన్స్‌ పట్టుబడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఘటనలో

Guns on Road: దడ పుట్టిస్తోన్న గన్‌ కల్చర్‌.. ఇది అమెరికాలో కాదు.. మరెక్కడో తెలుసా..
Shaik Madar Saheb
|

Updated on: Dec 24, 2021 | 8:07 AM

Share

Man arrested with 12 guns: గన్‌ కల్చర్‌ దడ పుట్టిస్తోంది. అమెరికానే కాదు.. భారత్‌లోనూ గన్‌ సంస్కృతి విస్తరిస్తోంది. హర్యానాలో ఏకంగా రోడ్లపై గన్స్‌ పట్టుబడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఘటనలో ఒకటి కాదు రెండు కాదు 12 పిస్టల్స్‌ లభ్యమయ్యాయి. అదీ కూడా నడిరోడ్డు మీద కనిపించడం హర్యానాలో హాట్‌టాపిక్‌గా మారింది. దీనిని పరిశీలిస్తేనే క్రైమ్‌ రేటు ఎలా పెరిగిందో ఇట్టే తెలిసిపోతుంది. పిస్టల్స్‌ పోలీసుల దగ్గర ఉండాలి.. లేదా ప్రాణహాని ఉన్న వారికి లైసెన్స్‌ తీసుకుంటే పిస్టల్స్‌ అనుమతి ఇస్తారు. కానీ ఓ గ్యాంగ్‌ దగ్గర ఏకంగా 12 పిస్టల్స్‌ పట్టుబడటం ప్రస్తుతం కలకలం రేపుతోంది. గన్స్‌తో చెలరేగుతున్న హర్యానా రాష్ట్రం కన్వా గ్రామంలోని రెండు గ్యాంగ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

గురువారం కపిల్‌ సంగ్వాన్‌, అలియాస్‌ నందు గ్యాంగ్‌.. జ్యోతిబాబా గ్యాంగ్.. ఈ రెండు గ్యాంగ్‌లను పట్టుకున్న పోలీసులు వారి దగ్గరి నుంచి 12 పిస్టల్స్‌తోపాటు 47 కాట్రిడ్జ్‌లను, ఓ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు గ్యాంగ్‌ల మధ్య ఘర్షణ జరగడంతో ఇలా అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు. అయితే.. ముందు పోలీసులను చూసిన నిందితుడు.. కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు కూడా నిందితుడిపై కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ క్రమంలో గ్యాంగ్‌ సభ్యుడు గాయపడ్డాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పట్టుబడ్డ గ్యాంగ్‌ సభ్యులను లోతుగా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గతంలో ఈ ప్రాంతంలో ఎలాంటి నేరాలు చేశారు…? ఈ గ్యాంగ్‌కు పొలిటికల్‌ సపోర్ట్‌ ఉందా..? లేక మరెవ్వరైనా ఉగ్రవాద సంస్థల మద్ధతు ఉందా అనే కోణంలో విచారణ జరుగుతోంది. ఈ గ్యాంగ్‌కు తుపాకులు ఎలా చేరాయి..మరెవ్వైనా గ్రూపులు ఉన్నాయా…అనే యాంగిల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

అయితే.. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ మంజీత్ మహల్ నేతృత్వంలో.. ప్రత్యర్థి ముఠా సభ్యులను పట్టుకోవడానికి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఏర్పాటు చేస్తున్నట్లు నిందితులు వెల్లడించారని పోలీసు అధికారులు తెలిపారు.

Also Read:

Shilpa Chowdary Case: శిల్పా చౌదరికి ఎట్టకేలకు బెయిల్.. కానీ షరతులు వర్తిస్తాయి.. అవేంటంటే..?

Kidnap Case: మామే నిందితుడు.. హైదరాబాద్‌లో కిడ్నాప్‌కు గురైన చిన్నారి ఆచూకీ లభ్యం.. అసలేమైందంటే..?