AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: మాజీ హోంమంత్రికి కోర్టులో చుక్కెదురు.. మరో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు!

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు మరోసారి చుక్కెదురైంది. దోపిడీ, మనీలాండరింగ్ ఆరోపణలతో చుట్టుముట్టిన దేశ్‌ముఖ్ జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించారు.

Maharashtra: మాజీ హోంమంత్రికి కోర్టులో చుక్కెదురు.. మరో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు!
Anil Deshmukh
Balaraju Goud
|

Updated on: Jan 20, 2022 | 5:10 PM

Share

Anil Deshmukh Judicial Custody: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు మరోసారి చుక్కెదురైంది. దోపిడీ, మనీలాండరింగ్ ఆరోపణలతో చుట్టుముట్టిన దేశ్‌ముఖ్ జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించారు. అతనిపై దోపిడీ మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ED)నవంబర్ 2, 2021 న అతన్ని అరెస్టు చేసింది. అతను ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు (Mumbai Central Jail)లో ఉన్నాడు. గతంలో ముంబై ప్రత్యేక కోర్టు నుంచి కూడా ఎదురుదెబ్బ తగిలింది.

అతని డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక PMLA కోర్టు మంగళవారం (జనవరి 18న) ముంబై ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ చేసిన రికవరీ అభియోగంపై కోర్టు దేశ్‌ముఖ్‌కు బెయిల్ మంజూరు చేయలేదు. డిసెంబర్ 2020, మార్చి 2021 మధ్య ముంబై నగరంలోని బార్ యజమానుల నుండి సస్పెండ్ అయిన పోలీసు అధికారి సచిన్ వాజే చేసిన రికవరీని అనిల్ దేశ్‌ముఖ్‌కు తెలియజేసినట్లు ED ఆరోపించింది. ఆ డబ్బును అనిల్ దేశ్‌ముఖ్ తన వ్యాపారంలో ఉపయోగించుకున్నట్లు పేర్కొంది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

Read Also…..Medaram Jathara: ఫిబ్రవరి 16 నుంచి మేడారం మహాజాతర.. సకల ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర సర్కార్