Crime News: ఆసుపత్రి బయోగ్యాస్ ప్లాంట్‌లో పుర్రెలు, పిండాల ఎముకల కలకలం.. పోలీసుల విచారణలో సంచలనాలు!
మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి బయోగ్యాస్ ప్లాంట్‌లో భారీ సంఖ్యలో పిండాల అవశేషాలు బయటపడటంతో కలకలం రేగింది.
Maharashtra 11 Skulls, Bones of fetuses: మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి బయోగ్యాస్ ప్లాంట్‌లో భారీ సంఖ్యలో పిండాల అవశేషాలు బయటపడటంతో కలకలం రేగింది. అక్రమ అబార్షన్ కేసు దర్యాప్తులో వార్ధాలోని ఆర్వీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి బయోగ్యాస్ ప్లాంట్‌లో 11 పుర్రెలు, 54 పిండాల ఎముకలు లభించాయని సబ్ ఇన్‌స్పెక్టర్ జ్యోత్స్న గిరి తెలిపారు. ఇందుకు సంబంధించి ఆసుపత్రి డైరెక్టర్ రేఖా కదమ్, ఆమె సహచరులలో ఒకరిని అరెస్టు చేశారు. 13 ఏళ్ల బాలిక అక్రమ అబార్షన్‌పై విచారణ సందర్భంగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అక్కడ నుండి తడిసిన బట్టలు, బ్యాగులు, తవ్వడానికి ఉపయోగించే గడ్డపారలు, అక్కడ విసిరిన ఇతర ఆధారాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాటిని సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఈ కేసుకు సంబంధించి జనవరి 4న ఆర్‌వి పోలీసులకు సమాచారం అందిందని మహిళా దర్యాప్తు అధికారుల బృందం అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ వందనా సోనూనే, పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ జ్యోత్స్న తెలిపారు. స్థానికుల నుంచి అందిన సమాచారం మేరకు ఈ బృందం పరిశీలించి ఎట్టకేలకు మైనర్ బాలికను గుర్తించి, ఆమె తల్లిదండ్రుల నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టింది. అమ్మాయి కుటుంబాన్ని అబ్బాయి కుటుంబం బెదిరించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం బయటపడింది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సోనూనె మాట్లాడుతూ.. బాలికకు అక్రమ అబార్షన్ చేసిన ఐదు రోజుల తర్వాత జనవరి 9న ఈ విషయంలో మొదటి ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా, పోలీసు బృందం కదమ్ ఆసుపత్రిపై దాడి చేసి దాని డైరెక్టర్ రేఖా నీరజ్ కదమ్ మరియు నర్సు సంగీత కాలేలను అరెస్టు చేసింది. ఇందుకు మరో ఇద్దరూ సహకరించి 30 వేల రూపాయలు వసూలు చేశారు. కాగా, బాధితురాలికి పూర్తి భద్రత కల్పిస్తామని పూర్తి హామీ ఇచ్చామని పోలీసులు తెలిపారు.
Maharashtra: 11 skulls & 54 bones of fetuses were found in biogas plant of a private hospital in Arvi, Wardha during the investigation of a separate case of illegal abortion. Hospital director Rekha Kadam & one of her associates were arrested: Sub-Inspector Jyotsna Giri (13.01) pic.twitter.com/4JtzeZquu6
— ANI (@ANI) January 14, 2022
బాలుడి తల్లిదండ్రులు కృష్ణ సాహె, అతని భార్య నల్లును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా అబార్షన్ చేయించుకుని కుటుంబసభ్యులతో మాట్లాడినందుకు తీవ్ర పరిణామాలుంటాయని మైనర్ బాలికను బెదిరించాడు. ఈ వారంలో రెండు రోజులు రిమాండ్‌లో ఉన్న ఈ నలుగురు నిందితులను పోలీసులు విచారించినప్పుడు, వారు ప్రతిదీ చెప్పారు. ఆ తర్వాత వారిని బయోగ్యాస్ ప్లాంట్‌కు మరియు చుట్టుపక్కల తీసుకెళ్లారు. ఇవి చాలా సీరియస్‌గా ఉన్నాయని ఏపీఐ సోనూనే తెలిపారు. 2012లో ఇక్కడ బెట్ బచావో ప్రచారానికి నాయకత్వం వహించిన పూణేకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ గణేష్ ఖ్ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు.
Read Also…. Makara Sankranti 2022: భిన్నత్వంలో ఏకత్వం పతంగుల పండుగ.. దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలేంటో తెలుసా!