Hyderabad: హైదరాబాద్ లెమన్ ట్రీ హోటల్‌లో దారుణం.. ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య
హైదరాబాద్ మాదాపూర్‌లో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయిని హతమార్చిన ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాదాపూర్‌లోని లెమన్ ట్రీ హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Mahabubnagar Love Ccouple Dead: హైదరాబాద్ మాదాపూర్‌లో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయిని హతమార్చిన ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాదాపూర్‌లోని లెమన్ ట్రీ హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. హోటల్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతులను వికరాబాద్ జిల్లాకు చెందిన సంతోషి, రాములుగా గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మాదాపూర్‌లోని లెమన్ ట్రీ హోటల్‌లో రూం అద్దెకు తీసుకున్న జంట.. ఎంతకీ డోర్ తీయకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది లోపలికి వెళ్లి చూసేసరికి ఇద్దరు విగతజీవులుగా కనిపించారు. సంతోషి బాత్రూమ్‌లో రక్తం మడుగులో పడి ఉండగా, రాములు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో మాదాపూర్ పోలీసులకు హోటల్ సిబ్బంది సమాచారం అందించారు. సంతోషి తలపై బలంగా కొట్టడంతో తీవ్రగాయాలు అయ్యినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం రాములు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని ఏసీపీ రఘునందన్ రావు తెలిపారు. హోటల్ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్న పోలీసులు.. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే అయితే సంతోషి కుటుంబ సభ్యులు మాత్రం రాములు ఎవరో తమకు తెలియదని చెబుతున్నారు. సంతోషి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రూమ్ చెక్ ఔట్ చేయాల్సి ఉండగా , దానిని ఈ రోజు కూడా పొడిగించినట్లు తెలుస్తోంది.
Read Also…