Church Pastor: ఉప్పల్ గాస్పల్ చర్చిలో కీచక పాస్టర్.. యువతులనే టార్గెట్.. అరెస్టు చేసిన పోలీసులు..!
Church Pastor: కొందరు మతబోధకులుగా ఉంటూ అరాచకాలకు పాల్పడుతున్నారు. ఉప్పల్ గాస్పల్ చర్చిలో కీచక పాస్టర్ చేష్టలు సంచలనంగా మారాయి. పాస్టర్ ముసుగులో..
![Church Pastor: ఉప్పల్ గాస్పల్ చర్చిలో కీచక పాస్టర్.. యువతులనే టార్గెట్.. అరెస్టు చేసిన పోలీసులు..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2021/06/arrest-1.jpg?w=1280)
Church Pastor: కొందరు మతబోధకులుగా ఉంటూ అరాచకాలకు పాల్పడుతున్నారు. ఉప్పల్ గాస్పల్ చర్చిలో కీచక పాస్టర్ చేష్టలు సంచలనంగా మారాయి. పాస్టర్ ముసుగులో చర్చికి వచ్చే యువతులకు గాలం వేస్తున్నాడు. పాస్టర్ జోసెఫ్ అలియాస్ సాదు చిన్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఉప్పల్‌లో ఆయన సొంతంగా చర్చి నిర్వహిస్తూ పాస్టర్‌గా పని చేస్తున్నాడు.
అలాగే మతపరమైన టీవీ ఛానల్లో మత ప్రబోధకుడు గా పనిచేసే జోసఫ్.. అమాయక ఆడపిల్లలే టార్గెట్‌గా చేసుకుని లైంగిక వాంఛలు తీర్చుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు మహిళలు ఆరోపిస్తున్నారు. యువతులపై ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న పాస్టర్‌పై మేడిపల్లి పోలీసుస్టేషన్‌లో ఎమ్మార్పీఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. అలాగే ముగ్గురు యువతులు ఇప్పటికే జోసఫ్‌పై ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు పాస్టర్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
ఇలా తమకు తెలియకుండా ఇంకా ఎంతమంది యువతులు ఉన్నారోనని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న పాస్టర్‌ను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.