AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎరువులతో వెళ్తున్న లారీలు లూఠీ.. షాక్ తిన్న అధికారులు..

మధ్యప్రదేశ్‌లో ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుంటే.. మరోవైపు రాష్ట్రంలోని షాజాపూర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎరువులతో వెళ్తున్న ఓ రెండు లారీలను స్థానిక గ్రామస్ధులు అడ్డుకున్నారు.

ఎరువులతో వెళ్తున్న లారీలు లూఠీ.. షాక్ తిన్న అధికారులు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 19, 2020 | 11:40 AM

Share

మధ్యప్రదేశ్‌లో ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుంటే.. మరోవైపు రాష్ట్రంలోని షాజాపూర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎరువులతో వెళ్తున్న ఓ రెండు లారీలను స్థానిక గ్రామస్ధులు అడ్డుకున్నారు. అంతేకాదు అందులో ఉన్న ఎరువుల సంచులను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది. సహకారం సంఘం అధికారులు ఈ ఎరువుల లారీలను తరలిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. జిల్లా సహకార సంఘం బ్యాంక్ సీఈవో ఏకే హర్సోలా తెలిపిన ప్రకారం.. రెండు లారీల్లో ఎరువుల సంచులను తరలిస్తుండగా.. ఓ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు లారీలను అడ్డుకున్నారని తెలిపారు. అంతేకాదు.. అందులో ఉన్న ఎరువుల సంచులను ఎవరికి అందినన్ని వారు దోచుకెళ్లారని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు.

కాగా, ఓ వైపు రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు లారీలను పెద్ద సంఖ్యలో గుంపులు గుంపులుగా వచ్చి అడ్డుకున్నట్లు సమాచారం.