Crime News: దీపావళీ వేళ.. ఆ ఇంటి దీపం ఆరిపోయింది.. మచిలీపట్నంలో వివాహిత అనుమానాస్పద మృతి
దీపావళీ పండుగవేళ.. దీపాలు వెలిగించాల్సిన చోట ఆ ఇంటి దీపం ఆరిపోయింది. కృష్ణాజిల్లాలో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది.
Woman Suspected Death: దీపావళీ పండుగవేళ.. దీపాలు వెలిగించాల్సిన చోట ఆ ఇంటి దీపం ఆరిపోయింది. కృష్ణాజిల్లాలో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. మచిలీపట్నం రామానాయుడు పేటలో నివాసముండే మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. రామానాయుడుపేట ప్రాంతానికి పామర్తి శివకృష్ణ భార్య రజిత (30) ఇంట్లో ఉరివేసుకుని మరణించిందని కుటుంబసభ్యులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అయితే, భర్తే రజితను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువుల ఆరోపిస్తున్నారు. తరుచూ ఆమె వేధింపులకు గురి చేసేవాడని, ఇదే క్రమంలో రజితను హతమార్చినట్లు మండిపడ్డారు. ఈ మేరకు మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌లో మృతురాలి బంధువులు పిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసిన కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు.