Telangana: పెళ్లి చూపుల్లో అబ్బాయి న‌చ్చ‌లేద‌ని చెప్పిన యువ‌తి… అత‌డు చేసిన ప‌ని క‌నీసం మీరు ఊహించ‌లేరు

ఓ యువ‌తికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో మంచి కుటుంబానికి బిడ్డ‌ని పంపించాల‌ని ఆశ‌ప‌డ్డారు.

Telangana: పెళ్లి చూపుల్లో అబ్బాయి న‌చ్చ‌లేద‌ని చెప్పిన యువ‌తి... అత‌డు చేసిన ప‌ని క‌నీసం మీరు ఊహించ‌లేరు
Software Engineer Arrested
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 04, 2021 | 10:09 AM

ఓ యువ‌తికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో మంచి కుటుంబానికి బిడ్డ‌ని పంపించాల‌ని యువ‌తి త‌ల్లిదండ్రులు ఆశ‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలో ఓ మ్యాచ్ చూడ‌గా.. అబ్బాయి న‌చ్చ‌లేద‌ని యువ‌తి చెప్పింది. మాములుగా అయితే ఇక్క‌డితో మేట‌ర్ ఎండ్ అవుతుంది. అయితే స‌ద‌రు యువ‌తి పెళ్లి చూపుల్లో తాను న‌చ్చ‌లేద‌ని చెప్ప‌డంతో అత‌డు హ‌ర్ట‌య్యాడు. కోపంతో ర‌గిలిపోయాడు. ఫేస్‌బుక్ ద్వారా వేధింపులకు పాల్పడ్డాడు. తాజాగా ఆ కేటుగాడిని హైదరాబాద్ మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వివ‌రాల్లోకి వెళ్ల‌గా.. బోడుప్పల్‌కు చెందిన ఓ యువతి నగరంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా వ‌ర్క్ చేస్తోంది. తన వివాహం కోసం మ్యాట్రిమోని సైట్‌లో నేమ్ రిజిస్ట‌ర్ చేసుకుంది. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ పెళ్లి చేసుకోవాల‌ని భావిస్తోన్న ఏపీలోని నెల్లూరు నగరానికి చెందిన సువనం సాయి కుమార్ (29) ఆమెను సంప్రదించాడు.

యువతి కుటుంబసభ్యుల పిలుపు మేరకు నెల రోజుల క్రితం పెళ్లి చూపుల కోసమని ఫ్యామిలీతో కలిసి బోడుప్పల్‌లోని యువతి ఇంటికొచ్చాడు. అయితే సాయికుమార్ యువతి కుటుంబ సభ్యులకు నచ్చకపోవడంతో సంబంధం వ‌ద్ద‌ని చెప్పారు. దీంతో యువతిపై క‌క్ష‌ పెంచుకున్న అతడు ఫేస్‌బుక్ ఫేక్ ఖాతా తెరిచి యువతికి అసభ్య మెసేజ్‌లు పంపుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో బాధితురాలు మేడిపల్లి పోలీసులకు కంప్లైంట్ చేయగా వారు సాంకేతిక‌త‌ సాయంతో సాయికుమార్‌ని పట్టుకుని బుధవారం రిమాండ్‌కు తరలించారు.

Also Read: Telangana: సీజేఐ ఎన్వీ రమణకు థ్యాంక్స్‌ చెప్పిన సజ్జనార్‌.. ఎందుకంటే..

ఇదెక్కడి బాదుడురా నాయనా.. సంక్రాంతికి టిక్కెట్ రేట్లు ఎంతో తెలుసా
ఇదెక్కడి బాదుడురా నాయనా.. సంక్రాంతికి టిక్కెట్ రేట్లు ఎంతో తెలుసా
గేమ్‌ ఛేంజర్ ఈవెంట్‌కు కియారా డుమ్మా.. ఎందుకంటే ??
గేమ్‌ ఛేంజర్ ఈవెంట్‌కు కియారా డుమ్మా.. ఎందుకంటే ??
గేమ్‌ ఛేంజర్ టీమ్‌కి చంద్రబాబు, పవన్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్
గేమ్‌ ఛేంజర్ టీమ్‌కి చంద్రబాబు, పవన్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
కాలేజ్ గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా !!
కాలేజ్ గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా !!
పాలతో మఖానా కలిపి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలిస్తే వదిలిపెట్టరు !!
పాలతో మఖానా కలిపి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలిస్తే వదిలిపెట్టరు !!
ప్రొటీన్‌ ఆహారం తీసుకుంటే నీళ్లు ఎక్కువగా తాగాలా ??
ప్రొటీన్‌ ఆహారం తీసుకుంటే నీళ్లు ఎక్కువగా తాగాలా ??
ఆడ తోడు కోసం వెదుకుతున్న పులి.. ఇలా దొరికిపోయింది..
ఆడ తోడు కోసం వెదుకుతున్న పులి.. ఇలా దొరికిపోయింది..