నన్‌పై బిషప్ అత్యాచారం కేసు.. సెప్టెంబర్ 16కు వాయిదా
కేరళలో నన్‌పై అత్యాచారం కేసులో జలంధర్ డియోసెస్ మాజీ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌పై గురువారం కోర్టు అభియోగాలు నమోదు చేసింది. అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి ములక్కల్‌పై కేసుకు సంబంధించి చార్జిషీట్ ను చదివి వినపించారు. కేసు విచారణ ప్రారంభమైన సమయంలో అత్యాచారం చేసిన నేరానికి ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలను మోపారు.
కేరళలో నన్‌పై అత్యాచారం కేసులో జలంధర్ డియోసెస్ మాజీ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌పై గురువారం కోర్టు అభియోగాలు నమోదు చేసింది. అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి ములక్కల్‌పై కేసుకు సంబంధించి చార్జిషీట్ ను చదివి వినపించారు. కేసు విచారణ ప్రారంభమైన సమయంలో అత్యాచారం చేసిన నేరానికి ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలను మోపారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను నిందితుడు ములక్కల్ ఖండించారు. బాధితురాలికి పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా కోర్టు కేసును సెప్టెంబర్ 16కు వాయిదా వేసింది.
కేరళలోని కొట్టాయంలో 2018 జూన్‌లో ఓ నన్ పోలీసులను ఆశ్రయించింది. 2014-2016 మధ్యకాలంలో బిషన్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నన్ ఆరోపించింది. దీంతో కొట్టాయం పోలీసులు ములక్కల్‌పై సెక్షన్ 342, 377, 376(సీ)(ఏ), 376(2)(కే), 506 సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ప్రత్యేక బృందం దర్యాప్తు జరిపింది. నేరపూరిత బెదిరింపులు, అక్రమ నిర్బంధం, అత్యాచారం, అసహజ లైంగిక చర్యలకు ములక్కల్ పాల్పడినట్లు పోలీసులు నిర్ధారిస్తూ చార్జిషీట్ ను దాఖలు చేసింది.
కాగా, గతవారం బిషప్‌కు కఠిన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ట్రయల్ కోర్టు, కేసు విచారణ తేదీల్లో హాజరు కావాలంటూ ఆదేశించింది. జలంధర్‌లోని ఒక సంఘానికి చెందిన నన్ తనపై అత్యాచారం చేశారంటూ వేసిన కేసు నుంచి విముకి కల్పించాలని ములక్కల్ చేసిన వినతిని సుప్రీం కోర్టు ఆగస్ట్ 5న తోసిపుచ్చింది. కేసులో విచారణ ఎదుర్కోవాలని స్పష్టం చేసింది. జూలై 7న కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ములక్కల్ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ ఏడాది మార్చిలో విచారణ కోర్టు తన డిశ్చార్జ్ పిటిషన్‌ను కొట్టి వేసిన నేపథ్యంలో రోమన్ క్యాథలిక్ చర్చి సీనియర్ బిషప్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.