మద్యం డబ్బుల కోసం సొంత బిడ్డనే అమ్మిన తల్లి
పేగు బంధాన్నే అమ్మకానికి పెట్టింది ఓ తల్లి. నవ మాసాలు మోసి కని పెంచిన కన్నబిడ్డను మద్యం కోసం అమ్మకానికి పెట్టింది ఓ కనికరంలేని తల్లి. ఈ సంఘటన హైదరాబాద్ మహానగరంలో జరిగింది. రెండు నెలల క్రితం జన్మనిచ్చిన బాబును రూ.45 వేలకు అమ్మానికి పెట్టింది. దీంతో పోలీసులు పక్కా సమాచారంతో కేసును ఛేదించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

గోషామహల్ ఏసీపీ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఎంఎస్ మక్తాకు చెందిన అబ్దుల్ ముజాహిద్(29), షేక్ జోహాఖాన్(22) దంపతులు ఇటీవల హబీబ్‌నగర్ పరిధిలోని సుభాన్‌పురాకు మకాం మార్చారు. వీరికి రెండు నెలల క్రితం కుమారుడు జన్మించాడు. అయితే, మద్యం తాగే అలవాటున్న జోహాఖాన్ ఆమె భర్తతో తరుచు గొడవ జరిగేది. ఇదిలావుంటే, ఈనెల 3న ముజాహిద్ బంధువుల ఇంటికి వెళ్లాడు. 8వ తేదీన తిరిగి ఇంటికి రాగా కొడుకు కనిపించలేదు. దీంతో భార్యను నిలదీయగా సుభాన్‌పురాకు చెందిన షేక్ మహమ్మద్(30), తబస్సుం (25)లకు రూ.45వేలకు అమ్మేసినట్లు భార్య ఒప్పుకుంది. తన కొడుకును వెంటనే ఇవ్వాలని ముజాహిద్ కోరినా వారు అంగీకరించకపోవడంతో ముజాహిద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
చంచల్‌గూడకు చెందిన ఆయేషా జబీన్(28)కి సంతానం లేకపోవడంతో.. అదే ప్రాంతానికి చెందిన షేక్ మహమ్మద్, తబస్సుంల ద్వారా బాబు(2 నెలలు) విషయం తెలుసుకుంది. దీంతో ఆగాపురా, సుభాన్‌పురాకు చెందిన ఆయేషాజబీన్ తల్లి షమీమ్ బేగం, పెద్దమ్మ సిరాజ్‌బేగంలు రూ.45 వేలకు బాబును విక్రయించేందుకు బేరం కుదుర్చుకున్నారు. డబ్బులు చెల్లించి ఆయేషా జబీన్ పిల్లాడిని తీసేసుకుంది. కాగా, కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆయేషా ఇంటిపై దాడి చేసి బాబును తీసుకుని తండ్రికి అప్పగించారు. ఆయేషా జబీన్, జోహాఖాన్, షేక్ మహమ్మద్, తబస్సుం, షమీమ్ బేగం, సిరాజ్ బేగంలను అరెస్టు చేశారు. కేసును ఛేదించిన పోలీసులను ఏసీపీ అభినందించారు.