AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“ఆన్‌లైన్ గేమ్” మీ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించండి

సుమారు రూ.1,100 కోట్ల నగదు ట్రాన్జాక్షన్ జరిగిందని అన్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఐటీశాఖకు సమాచారం ఇచ్చామని, ఆన్‌లైన్‌ గేమింగ్ తెలంగాణలో రద్దైందని వెల్లడించారు...

ఆన్‌లైన్ గేమ్ మీ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించండి
Sanjay Kasula
|

Updated on: Aug 13, 2020 | 6:20 PM

Share

ప్రపంచం మొత్తం కరోనా భయంతో ఇంట్లో ఉంటే చైనీయులు మాత్రం అక్రమాలకు డోర్లు తెరిచారు. ఆన్ లైన్ గేమ్స్ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. అంతర్జాతీయంగా జరిగిన ఈ గుట్టును మన హైదరాబాద్ సీసీఎస్‌ పోలీసులు రట్టుచేశారు. లాక్ డౌన్ కొనసాగిన మూడు నెలల్లో రూ. వెయ్యి కోట్లకు పైగా కొల్లగొట్టారు. చైనాకు చెందిన ఓ కంపెనీ భారీ మోసానికి పాల్పడింది. ఈ ముఠాపై సైబర్ క్రైంలో రెండు కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.

టెలిగ్రాం గ్రూప్ ద్వారా అడ్మిన్ సహాయంతో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారని తెలిపారు. వెబ్‌సైట్స్‌ను ప్రతిరోజు కొత్తగా మార్చుతూ.. అందులోని సమాచారాన్ని గ్రూప్‌లోని సభ్యులకు మాత్రమే తెలిసేలా ప్లాన్ చేశారు. ఇప్పటి వరకు పలు బ్యాంకు ఖాతాల్లో రూ.30కోట్లు సీజ్‌ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఒక చైనీయునితో పాటు నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ కంపెనీలో చైనా, ఇండియాకు చెందిన డైరెక్టర్లు ఉన్నారని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. సుమారు రూ.1,100 కోట్ల నగదు ట్రాన్జాక్షన్ జరిగిందని అన్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఐటీశాఖకు సమాచారం ఇచ్చామని, ఆన్‌లైన్‌ గేమింగ్ తెలంగాణలో రద్దైందని వెల్లడించారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌లో మోసపోయి చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని, పిల్లలపై దృష్టి పెట్టాలని సీపీ తెలిపారు. ఆన్‌లైన్‌ తమ పిల్లలు ఏం చేస్తున్నారని తల్లిదండ్రులు గమనించాలని సీపీ అంజనీ కుమార్‌ సూచించారు.

Follow Us
ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చా..?
ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చా..?
అరెరే ఇన్నాళ్లు తెలీదే.. పాలపై మందపాటి మీగడ తేవడం ఇంత ఈజీనా
అరెరే ఇన్నాళ్లు తెలీదే.. పాలపై మందపాటి మీగడ తేవడం ఇంత ఈజీనా
నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం!
నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం!
ఆగస్టు 15కి ముందే స్వాతంత్ర్య వేడుకలు.. ఈ 2ఆలయాల్లో ప్రత్యేకత..
ఆగస్టు 15కి ముందే స్వాతంత్ర్య వేడుకలు.. ఈ 2ఆలయాల్లో ప్రత్యేకత..
చంద్రుని చల్లని చూపు.. శ్రావణ మాసంలో శుభవార్తలు అందుకునే రాశులివే
చంద్రుని చల్లని చూపు.. శ్రావణ మాసంలో శుభవార్తలు అందుకునే రాశులివే
పిండి రుబ్బేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు..ఇడ్లీలు మెత్తగా వస్తాయి
పిండి రుబ్బేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు..ఇడ్లీలు మెత్తగా వస్తాయి
ఏపీకి రెయిన్ అలర్ట్.. మూడ్రోజుల పాటు వర్షాలు
ఏపీకి రెయిన్ అలర్ట్.. మూడ్రోజుల పాటు వర్షాలు
9 వేల రన్స్.. 22 సెంచరీలు.. అయినా ఒక్క టెస్ట్ ఆడని మనోడు
9 వేల రన్స్.. 22 సెంచరీలు.. అయినా ఒక్క టెస్ట్ ఆడని మనోడు
తొందరపాటు నిర్ణయాలు వద్దూ.. ఈ రాశి వారు మాట జారితే అన్నీ బాధలే
తొందరపాటు నిర్ణయాలు వద్దూ.. ఈ రాశి వారు మాట జారితే అన్నీ బాధలే
స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం మధ్య తేడా ఏంటి..?
స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం మధ్య తేడా ఏంటి..?