ఘోర రోడ్డు ప్రమాదం.. రోడ్డు దాటుతున్న చిన్నారులను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం..నలుగురు మృతి
ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిరివెళ్ల మండలం యర్రగుండ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర.....
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిరివెళ్ల మండలం యర్రగుండ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయాలైనవారిని చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. రోడ్డు దాటుతున్న చిన్నారులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతులు సురేఖ (10), హర్షవర్ధన్ (10), ఝాన్సీ (11), వంశీలుగా (11) గుర్తించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.