ప్రముఖ ఏరోస్పేస్ శాస్త్రవేత్త మృతి.. ఆయన తయారు చేసిన విమానాలు ఏంటో తెలుసా?

ప్రముఖ ఏరోస్పేస్ శాస్త్రవేత్త ఫ్రొఫెసర్ రొడ్డం నరసింహ ఇకలేరు. మెదడులో రక్తస్రావం కావడంతో

  • uppula Raju
  • Publish Date - 5:25 am, Tue, 15 December 20
ప్రముఖ ఏరోస్పేస్ శాస్త్రవేత్త మృతి.. ఆయన తయారు చేసిన విమానాలు ఏంటో తెలుసా?

ప్రముఖ ఏరోస్పేస్ శాస్త్రవేత్త ఫ్రొఫెసర్ రొడ్డం నరసింహ ఇకలేరు. మెదడులో రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కాగా రాత్రి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా నరసింహ భారతదేశానికి ఎంతో సేవ చేశారు. ఇస్రో తేలికపాటి యుద్ద విమానాల నిర్మాణంలో ఆయన పాలుపంచుకున్నారు. నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రొఫెసర్ సతీశ్ ధావన్ మొదటి విద్యార్థి ఈయనే. ఆయన దగ్గర పాఠాలు నేర్చుకొని అత్యున్నత సైంటిస్ట్‌గా ఎదిగారు. భట్నాగర్ అవార్డుతో పాటు భారత ప్రభుత్వం అందించే పద్మవిభూషణ్ కూడా అందుకున్నారు.