AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కల్లు కాదిది కాటికి పంపే రసాయనం.. ఒక్కసారి రుచి చూశారో అంతే సంగతులు.. ఎలా తయారు చేస్తారంటే..

కల్తీ కల్లు విక్రయిస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొంతమంది వ్యాపారులు.

కల్లు కాదిది కాటికి పంపే రసాయనం.. ఒక్కసారి రుచి చూశారో అంతే సంగతులు.. ఎలా తయారు చేస్తారంటే..
uppula Raju
|

Updated on: Dec 15, 2020 | 5:29 AM

Share

కల్తీ కల్లు విక్రయిస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొంతమంది వ్యాపారులు. కార్మికులు, కూలీల కడుపులు కొడుతూ అడ్డంగా సంపాదిస్తున్నారు. వింత మత్తును అలవాటు చేసి వారి కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. ఒల్లు గుళ్ల చేసి ఆస్పత్రుల చుట్టూ తిప్పిస్తున్నారు. రాజకీయ నాయకులు, అధికారుల అండదండలతో కేసుల నుంచి తప్పించుకొని దర్జాగా తిరుగుతున్నారు. ఇంత జరుగుతున్నా ఏ నాయకుడు పట్టించుకోడు. ఏ అధికారి తనిఖీలు నిర్వహించడు.

1993లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీలో సారా, కల్లు పై నిషేధించేందుకు ప్రయత్నం చేశారు. కానీ గీత కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆయన వెనక్కు తగ్గారు. తర్వాత వైఎస్ఆర్ సర్కార్ 767 జి.ఓతో హైదరాబాద్లో 104 కల్లు దుకాణాలు రద్దు చేసింది. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ కల్లు దుకాణాలను మళ్లీ తెరిపించారు. కల్లుకు బానిసలై వాళ్లు లాక్ డౌన్ లో కల్లు దొరక్క పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించారు. దాదాపు 200 మంది వరకు ఆసుపత్రుల పాలయ్యారు.

ఇప్పటి వరకు తెలంగాణలో కల్తీకల్లుకు గురైన సంఘటనలు ఈ విధంగా ఉన్నాయి. సెప్టెంబర్, 2013 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కల్తీ కల్లు తాగి ముగ్గురు మరణించారు. డిసెంబర్ 2014 రంగారెడ్డి జిల్లా పెద్దమల్‌లో సమీరుద్దీన్ అనే వ్యక్తి కల్తీ కల్లు తాగి మృతి చెందాడు. 2015 సెప్టెంబరులో ఉమ్మడి మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలో 30 వరకు కల్తీ కల్లు తాగి మృతిచెందారు. ఏప్రిల్, 2018 నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం పోచంపల్లిలో కల్తీ కల్లు తాగి 15 మంది అస్వస్థతకు గురయ్యారు. జులై, 2020లో నిర్మల్ జిల్లా సింగన్ గావ్ గ్రామంలో కల్తీ కల్లు తాగి చంద్రకాంత్ అనే యువకుడు మృతి చెందాడు. డిసెంబర్ 13, 2020న మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఆలూరు గ్రామంలో కల్తీ కల్లు తాగి ఇద్దరు మృతి చెందారు.

వ్యాపారులు మత్తు కోసం ఇందులో రకరకాల రసాయనాలు కలుపుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.10 లీటర్ల స్వచ్ఛమైన కల్లుకు 150 లీటర్ల నీళ్లు, మత్తు కోసం ఆల్ఫ్రోజోలం, డైజోఫాం, క్లోరో హైడ్రెడ్ తదితర నిషేధిత మత్తు రసాయనాలు కలుపుతున్నారు. అంతేకాకుండా అమ్మోనియం మిశ్రమ రసాయనాలు, సోడా యాష్, కుంకుడుకాయ రసం వాడుతున్నారు. దీనివల్ల నాడీ వ్య వస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కళ్లు పోవడం, మెదడు సరిగ్గా పనిచేయకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మూత్రపిండాల వ్యాధులు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు ప్రాణాలు సైతం పోతున్న ఘటనలు సంభవిస్తున్నాయి.