కశ్మీర్‌లో డ్రగ్స్ కలకలం.. ఇద్దరు అరెస్ట్..
జమ్ముకశ్మీర్‌లో గత కొద్ది రోజులుగా డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. హర్యానా లోని గుర్‌గ్రామ్ నుంచి కశ్మీర్ ప్రాంతానికి నిషేధిత డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఓ వాహనంలో కోరేక్స్ కాఫ్..
జమ్ముకశ్మీర్‌లో గత కొద్ది రోజులుగా డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. హర్యానా లోని గుర్‌గ్రామ్ నుంచి కశ్మీర్ ప్రాంతానికి నిషేధిత డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఓ వాహనంలో కోరేక్స్ కాఫ్ సిరప్ బాటిళ్లు, స్పాస్మో-ప్రోక్సివన్ క్యాప్సల్స్‌ను గుర్తించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న పక్కా సమాచారం అందడంతో.. పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ వాహనంలో 5,760 కాఫ్ సిరఫ్‌తో పాటు.. 38,160 క్యాప్సల్స్‌ను సీజ్ చేశారు. ఈ సంఘటన సంబా ప్రాంతంలో చోటుచేసుకుంది. సంబా డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాలోని గుర్‌గ్రామ్ ప్రాంతం నుంచి కశ్మీర్ ప్రాంతానికి కాఫ్ సిరప్‌తో పాటు.. నిషేధిత డ్రగ్ క్యాప్సల్స్‌ను ఓ వాహనంలో సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసుల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ వాహనంలో కాఫ్ సిరఫ్, క్యాప్సల్స్‌ను గుర్తించి సీజ్ చేశామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో వీరితో పాటు ఇంకా ఎవరు ఉన్నారన్న దానిపై ఆరా తీస్తున్నామని తెలిపారు.
Jammu & Kashmir: Police recover 5,760 bottles of Corex cough syrup and 38,160 capsules of Spasmo-Proxyvon capsules in Samba. DSP Samba says, “2 drug peddlers arrested. The drug consignment was being transported to Kashmir from Gurugram. Further investigation is underway.” pic.twitter.com/y6Bzyse9Ja
— ANI (@ANI) July 7, 2020