దారుణం.. ఆవుపై లైంగికదాడి చేసిన కామాందుడు..

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ 55 ఏళ్ల వ్యక్తి.. అనైతిక చర్యకు పాల్పడ్డాడు. ఏకంగా మూగజీవిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. భోపాల్‌లోని సుందర్ నగర్‌ ప్రాంతంలో ఈ సంఘటన..

దారుణం.. ఆవుపై లైంగికదాడి చేసిన కామాందుడు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 08, 2020 | 6:10 AM

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ 55 ఏళ్ల వ్యక్తి.. అనైతిక చర్యకు పాల్పడ్డాడు. ఏకంగా మూగజీవిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. భోపాల్‌లోని సుందర్ నగర్‌ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సుందర్ నగర్ ప్రాంతంలోని ఓ ఆవుపై జూలై 4వ తేదీన 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. తెల్లవారు జామున 4.00 గంటలకు ఆవుపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది. అయితే ఆవు అరవడంతో పాటు.. తెల్లవారిన తర్వాత అస్వస్థకు గురవ్వడంతో.. యజమానులు అక్కడే ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించారు. దీంతో ఓ వ్యక్తి ఆవుపై అత్యాచారానికి పాల్పడినట్లు అందులో రికార్డ్ అయ్యింది. ఘటనపై అశోక్ గార్డెన్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు యజమానులు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు.