AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు!

హైదరాబాద్‌లో ఘరానా మోసం వెలుగు చూసింది. నకిలీ వీసాలు, ఉద్యోగ ఆఫర్ లేటర్లతో విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న ఓ ముఠా హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీలసులు పట్టుకున్నారు. ఈ మోసాలకు పాల్పడుతున్న నలుగురిలో ఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకొని వారి నుంచి 9 పాస్ట్‌పోర్టులు, 5నకిలీ విసాలు, రెండ్‌ ఫోన్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.

Hyderabad: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు!
Noor Mohammed Shaik
| Edited By: Anand T|

Updated on: Jun 19, 2025 | 11:11 PM

Share

విదేశాలకు వెళ్లడం, అక్కడ ఉద్యోగాలు చేయడం చాలా మంది విద్యార్తుల కల. ఇలా విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుంటున్న కొంతమంది కేటుగాళ్లు నకిలీ ఉద్యోగ అవకాశాలు ఆశచూపి వాళ్లను నట్టేట ముంచేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ముఠానే హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నాచారంకి చెందిన నసీమా బాను అనే ఓ మహిళ, సయ్యద్ అదిల్ 23, ఫాతిమా, రేఖా అనే మరో ముగ్గురు కలిసి ముఠాలా ఏర్పడి తార్నాకలో వరల్డ్ వైడ్ ఓవర్సీస్ అనే కన్సల్టెంట్స్ ఏర్పాటు చేశారు. విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే విద్యార్థులను టార్గెట్‌గా చేసుకొని సింగపూర్, ఆస్ట్రేలియా, రష్యా విదేశాల్లో ఉద్యగాలు, వీసాలు తక్కువ ఖర్చుతో ఇప్పిస్తామని సోషల్ మీడియా మాద్యామాల్లో ప్రచారం చేశారు.

వాటిని చూసి వీరిని సంప్రదించిన కొంత మంది నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని సుమారు రూ.35 లక్షల వరకు వసూలు చేశారు. చెప్పిన మాట ప్రకారం తమ దగ్గరకు వచ్చిన వారికి విదేశాల్లో ఉద్యోగాలు వచ్చినట్టు నకిలీ ఆఫర్ లేటర్లు, ఫేక్ వీసాలు ఇచ్చారు. అయితే వీరు ఇచ్చిన ఆఫర్ లేటర్లు, వీసాలు నకిలీవని గుర్తించిన బాధితులు తము డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇక తమ అసలు రూపం బయటపడంతో చేసేదేమి లేక డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పిన ముఠా ఇవాళ , రేపు అంటూ కాలం గడుపుతూ ఉన్నపలంగా అక్కడి నుంచి దుకాణం సర్దేశించింది.

దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లాలాగూడ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. విశ్వసనీయ సమాచారంతో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, లలా గూడ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి నిందితులు నసీం బాను, అదిల్‌లను అరెస్ట్ చేసి వారి నుంచి 9 ఇండియన్ పాస్ పోర్టుల, 5 నకిలీ వీసా కాపీలు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వారిని లలా గూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..