ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్ల అవతారమెత్తారు.. కానీ ఇంటెలిజెంట్‌గా ఆలోచించలేక అడ్డంగా బుక్కయ్యారు..

ఇంటెలిజెంట్‌గా ఆలోచించామని అనుకున్నారో ఏమో ఏకంగా ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్ల అవతారమెత్తారు.  సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల వాహనాలపై నెంబర్‌ ప్లేట్‌ దగ్గర మాత్రమే....

ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్ల అవతారమెత్తారు.. కానీ ఇంటెలిజెంట్‌గా ఆలోచించలేక అడ్డంగా బుక్కయ్యారు..
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 21, 2021 | 8:35 AM

ఇంటెలిజెంట్‌గా ఆలోచించామని అనుకున్నారో ఏమో ఏకంగా ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్ల అవతారమెత్తారు.  సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల వాహనాలపై నెంబర్‌ ప్లేట్‌ దగ్గర మాత్రమే గవర్నమెంట్‌ వెహికల్‌ అని రాసి ఉంటుంది. అయితే కారుపైనే పెద్ద పెద్ద అక్షరాలు రాసి అడ్డంగా దొరికిపోయారు నకిలీ అధికారులు.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని అంబర్‌పేటకు చెందిన తండ్రీ కొడుకులు మురళీచంద్‌, దుర్గాభవన్‌లు ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో అధికారుల అవతారమెత్తారు. తమ కారుపై ప్రభుత్వ ఎంబ్లమ్‌ మాదిరిగా ముద్ర, ఇంటెలిజెన్స్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో అని పెద్ద అక్షరాలతో రాసుకున్నారు. ఇక్కడే వాళ్లు దొరికిపోయారు. సాధారణంగా ఏ ప్రభుత్వ వాహనానికైనా నెంబర్‌ ప్లేట్‌ దగ్గర గవర్నమెంట్‌ వెహికల్‌ అని రాసి ఉంటుంది. వీళ్లు మాత్రం కారుకు ముందు, వెనుక భాగంలో పెద్ద అక్షరాలతో ఇంటెలిజెన్స్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో అని రాయించుకున్నారు. దీంతో పోలీసులు ఈ నకిలీ అధికారులను ఈజీగా పట్టుకున్నారు. 2018లో వీళ్లు  ఇంటెలిజెన్స్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో పేరుతో ఓ సంస్థను రిజిస్టర్‌ చేయించినట్టు తెలుస్తోంది. కారు లోపల పనిచేయని పోలీసులు వాడే VHF సెట్‌ ఒకదాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరు తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మురళీచంద్‌, దుర్గాప్రసాద్‌ అనే తండ్రీకొడుకులిద్దరిపై ఐపీసీ సెక్షన్‌ 419, మోటార్‌ వెహికల్‌ చట్టం 177 ప్రకారం కేసులు నమోదు చేశారు నల్లకుంట పోలీసులు. వీరిద్దరు ఎక్కడెక్కడ మోసాలకు పాల్పడ్డారో ఆరా తీస్తున్నారు. మొదట గోల్డ్‌ కలర్‌ ఉండే కారును బ్లూ కలర్‌లోకి మార్చినట్టు పోలీసులు గుర్తించారు. ఎప్పటి నుంచి నకిలీ అధికారుల అవతారం ఎత్తారు? ఎక్కడెక్కడ మోసాలకు పాల్పడ్డారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు పోలీసులు.

వాహనాల తనిఖీలో భాగంగా ఏకంగా ఇంటెలిజెన్స్‌ బ్యూరో పేరుతో ఉన్న ఓ వాహనం పట్టుబడటం సంచలనం రేపుతోంది. ఇప్పటి వరకు వీళ్లు పోలీసుల కళ్లు గప్పి ఎలా సంచరించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటి నుంచి ఈ నకిలీ అవతారం ఎత్తారు? ఎంత మంది మోసం చేశారని పోలీసులు తండ్రీకొడుకులను విచారిస్తున్నారు.

Also Read :

50 రూపాయల కోసం గొడవ.. యువకుడిపై పిడిగుద్దులు.. రోడ్డుపైనే అనంత లోకాలకు

ఇంటి ముందుకే రైస్‌మిల్.. యువకుడి వినూత్న ఆలోచన.. స్వయం ఉపాధితో పలువురికి ఆదర్శం‌

తిరుపతి తొక్కిసలాటపై స్పందించిన మోహన్ బాబు
తిరుపతి తొక్కిసలాటపై స్పందించిన మోహన్ బాబు
వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస
వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..