Indian Fishermen: శ్రీలంకలో భారత జాలర్ల మృతి.. ఆ దేశ కోస్ట్ గార్డ్ అధికారుల పనే అంటూ ఆరోపణలు..
Indian Fishermen: శ్రీలంకలో ఇద్దరు భారత జాలర్లు మృతి చెందడం మిస్టరీగా మారింది. వివరాల్లోకెళితే.. తమిళనాడులోని పుదుక్కోటై నుంచి నలుగురు..
Indian Fishermen: శ్రీలంకలో ఇద్దరు భారత జాలర్లు మృతి చెందడం మిస్టరీగా మారింది. వివరాల్లోకెళితే.. తమిళనాడులోని పుదుక్కోటై నుంచి నలుగురు జాలర్లు చేపల వేటకు వెళ్లారు. అయితే అలా వెళ్లిన జాలర్ల పడవ రెండు రోజుల నుంచి మిస్ అయ్యింది. వారి కోసం గాలిస్తుండగా, తాజాగా మిస్సైన నలుగురిలో ఇద్దరు జాలర్ల మృతదేహాలు శ్రీలంక కోస్ట్ గార్డ్ సిబ్బంది వద్ద లభ్యమయ్యాయి. దీంతో వారి మృతిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇద్దరు చనిపోగా.. మరో ఇద్దరు ఏమయ్యారనే దానిపైనా సందిగ్ధత నెలకొంది.
ఆచూకీ దొరకని ఇద్దరి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే జాలర్ల మృతిపై శ్రీలంక కోస్ట్ గార్డ్ అధికారులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ అధికారుల ఆధ్వర్యంలో శ్రీలంకలోని యాల్పానంలో సదరు జాలర్ల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. కాగా, జాలర్ల మృతిపై తమిళనాడు మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిస్సైన జాలర్లను శ్రీలంక కోస్ట్ గార్డ్ అధికారులే చంపేశారని ఆరోపిస్తున్నారు.
Also read: