Hyderabad Student: గోడ శిథిలాలు తొలగిస్తున్న జీహెచ్ఎంసీ అధికారుల షాక్.. కనిపించకుండాపోయిన వ్యక్తి మృతదేహం లభ్యం..!
వాకింగ్ కోసం వెళ్లిన వ్యక్తి విగత జీవిగా మారాడు. నడుచుకుంటూ వెళ్తున్న ఇంజినీరింగ్ విద్యార్థిపై గోడ కూలి మీద పడటంతో మృతి చెందాడు. ఈ దుర్ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.
Hyderabad Engineering Student Death: వాకింగ్ కోసం వెళ్లిన వ్యక్తి విగత జీవిగా మారాడు. నడుచుకుంటూ వెళ్తున్న ఇంజినీరింగ్ విద్యార్థిపై గోడ కూలి మీద పడటంతో మృతి చెందాడు. ఈ దుర్ఘటన హైదరాబాద్ మహానగరంలోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్యాణ్ నగర్‌కు చెందిన ఆశిష్ బుధవారం సాయంత్రం వాకింగ్ చేసేందుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. చీకటి పడుతున్నప్పటికీ ఆశిష్ తిరిగి ఇంటికి రాకపోవడంతో అతని తల్లిదండ్రుల్లో కంగారు మొదలైంది. వర్షం కూడా కురుస్తుండటంతో మరింత ఆందోళనకు గురయ్యారు. బంధుమిత్రులతో పాటు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ తెలియలేదు. దీంతో వెంటనే అశిష్ తల్లిదండ్రులు.. ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలావుంటే, గురువారం రాజీవ్ నగర్ ప్రాంతంలో గోడ కూలడంతో స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న డీఆర్ఎఫ్ సిబ్బంది శిథిలాలను తొలగిస్తుండగా ఆశిష్ మృతదేహం బయటపడింది. అక్కడికి చేరుకున్న పోలీసులు అశిష్ డెడ్‌బాడీగా గుర్తించారు. వాకింగ్ చేస్తూ గోడ పక్కగా వెళుతుండగా అతనిపై పడటంతో మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also… Murder mystery: నెల్లూరులో దారుణహత్యకు గురైన సునీల్ మర్డర్ కేసు మిస్టరీ బయటపెట్టిన పోలీసులు