Hyderabad: దేశం కానీ దేశంలో ఈజీ మనీ మోజులో యవ్వారం.. డ్యామిట్ కథ అడ్డం తిరిగింది!

మాయమాటలతో రప్పించిన జంట, బంగ్లాదేశ్ యువతితో వ్యభిచారం చేయిస్తూ డబ్బు దండుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే బంగ్లా యువతి చెప్ప పెట్టకుండా అత్తాపూర్‌లోని కస్టమర్ వద్దకు వెళ్లడంతో అసలు బండారం బయటపడింది. యువతిని వెంబడించిన దంపతులు, ఆమెను పట్టుకునే క్రమంలో గొడవ జరగటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో అసలు యవ్వారం వెలుగులోకి వచ్చింది.

Hyderabad: దేశం కానీ దేశంలో ఈజీ మనీ మోజులో యవ్వారం.. డ్యామిట్ కథ అడ్డం తిరిగింది!
Couple Arrest
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Feb 11, 2024 | 6:46 PM

దారి దప్పిన ఆశలు, డబ్బు కోసం పాడు చేయించిన దంపతులు ఎట్టకేలకు కటకటాలపాలు చేసింది. డబ్బు సంపాదించాలనే ధ్యేయంతో బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ అక్రమ మార్గంలో సుమారు రెండు నెలల కిందట భారత దేశంలోకి అడుగు పెట్టింది. కోల్‌కత్తా నుండి సికిందరాబాద్‌కు ట్రైన్‌లో వచ్చింది. అక్కడి నుండి తనకు జాబ్ ఆఫర్ ఇచ్చిన పాతబస్తీ చాంద్రాయగుట్ట ప్రాంతంలో నివసించే దంపతుల వద్దకు చేరింది.

మాయమాటలతో రప్పించిన జంట, బంగ్లాదేశ్ యువతితో వ్యభిచారం చేయిస్తూ డబ్బు దండుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే బంగ్లా యువతి చెప్ప పెట్టకుండా అత్తాపూర్‌లోని కస్టమర్ వద్దకు వెళ్లడంతో అసలు బండారం బయటపడింది. యువతిని వెంబడించిన దంపతులు, ఆమెను పట్టుకునే క్రమంలో గొడవ జరగటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో అసలు యవ్వారం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయగుట్ట గాజి ఏ మిల్లత్ కాలనీకి చెందిన షేక్ సోనియా(27), మొహమ్మద్ సల్మాన్(24)దంపతులు నివసిస్తున్నారు. వస్త్ర దుకాణంలో పని చేసే సల్మాన్ షేక్, అదే ప్రాంతానికి చెందిన సోనియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె బంగ్లాదేశ్‌కు చెందిన మహిళా కూతురు. దీంతో కోల్‌కతా నగరంతో సోనియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈనేపథ్యంలోనే బంగ్లాదేశ్, మయన్మార్ దేశస్తులు పరస్పరం మాట్లాడుకోవటం కోసం ప్రత్యేకంగా ఒక యాప్ ఏర్పాటు చేసుకున్నారు.

ఈ క్రమంలోనే యాప్ ద్వారా సోనియా చాట్ చేస్తుండగా బంగ్లాదేశ్ ఓర్సిండి మండలం రాయ్‌పుర గ్రామానికి చెందిన శ్రిస్టి అక్తర్(22) పరిచయమైంది. వీరి మధ్య సాన్నిహిత్యం పెరగటంతో హైదరాబాద్‌లో ఉద్యోగం వెతుకుంటూ వచ్చింది అక్తర్. రెండు నెలల క్రితం బంగ్లాదేశ్ సరిహద్దులు దాటి అక్రమ మార్గంలో కోల్‌కత్తా చేరుకుని, అక్కడి నుంచి ట్రైన్లో సికింద్రాబాద్ చేరుకుని సోనియాకు కాల్ చేసింది అక్తర్. హైదరాబాద్ చేరుకున్న ఆమెను ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం కల్పించారు సల్మాన్, సోనియా.

డబ్బు సంపాదించాలన్న దురాశతో అక్తర్‌ను మాయమాటలతో బెదిరించి వ్యభిచారం రొంపిలోకి దింపారు. విటుల కోసం స్వయంగా సోనియానే అక్తర్ వెంట వెళ్లి వచ్చేది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 9న సోనియా పక్కింట్లోకి వెళ్లగా, అదే సమయంలో కస్టమర్ నుంచి ఫోన్ మోగింది. ఇదే అదునుగా సోనియాకు చెప్పకుండానే ఆటో ఎక్కి వెళ్ళింది అక్తర్. సోనియా వచ్చేసరికి అక్తర్ కనిపించకపోవడంతో కంగారుపడ్డ సోనియా ఫోన్ లాస్ట్ కాల్ ఆధారంగా వెతుకుంటూ వెళ్ళింది. ఆమెను వెంబడించి అత్తాపూర్ సమీపంలో పట్టుకుని నిలదీసింది.

దీంతో అక్తర్ డయల్ 100‌కు కాల్ చేయగా అత్తాపూర్ పోలీసులు చేరుకుని అదుపులోకి తీసుకుని చాంద్రాయగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దంపతులతో పాటు యువతిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వచ్చిన అక్తర్‌కు భర్త అసిఫ్ ఖాన్, ఇద్దరు సంతానం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మేస్త్రి పని చేసే అసిఫ్ ఖాన్ కుటుంబ పోషణ భారంగా మారడంతో, డబ్బులు సరిపోక ఆమె అక్రమ మార్గంలో దేశ సరిహద్దులు దాటి వ్యభిచార వృత్తిలోకి చేరినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…