Minor Girl: ఛీ.! వీడు అసలు తండ్రేనా.. కూతురిని గొంతు నులిమి, నదిలో తోసేసి..
ఆగ్రాలో అమానవీయ ఘటన జరిగింది. తన కుమార్తె ఓ బాలుడితో సన్నిహితంగా మాట్లాడడం చూసి తట్టుకోలేకపోయిన తండ్రి ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించాడు. పోలీసుల వివరాల ప్రకారం.. అలీఘర్‌కు చెందిన మైనర్ బాలిక ఉత్తరప్రదేశ్‌లో తన స్నేహతుడితో మాట్లడుతుండగా పట్టుకున్న కుటుంబసభ్యులు ఎక్కడ తమ పరువుపోతుందోనని భయపడ్డారు. ఆమె గొంతును మఫ్లర్‌తో నులిమి యమునా నదిలోకి తోసేసి పరారయ్యారు.
ఆగ్రాలో అమానవీయ ఘటన జరిగింది. తన కుమార్తె ఓ బాలుడితో సన్నిహితంగా మాట్లాడడం చూసి తట్టుకోలేకపోయిన తండ్రి ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించాడు. పోలీసుల వివరాల ప్రకారం.. అలీఘర్‌కు చెందిన మైనర్ బాలిక ఉత్తరప్రదేశ్‌లో తన స్నేహతుడితో మాట్లడుతుండగా పట్టుకున్న కుటుంబసభ్యులు ఎక్కడ తమ పరువుపోతుందోనని భయపడ్డారు. ఆమె గొంతును మఫ్లర్‌తో నులిమి యమునా నదిలోకి తోసేసి పరారయ్యారు. సమీపంలోని గ్రామస్థులు, అక్కడే ఉన్న డ్రైవర్లు ఆమె అరుపులు విని నదిలోకి దూకి కాపాడారు. తాను తన స్నేహితుడితో మాట్లాడుతుండగా చూసిన కుటుంబసభ్యులు తనకు పెళ్లి చేయాలని నిశ్చయించారని బాధితురాలు తెలిపింది. అందుకు తాను అంగీకరించకపోవడంతో హత్య చేయడానికి కూడా వెనకాడలేదని శిశు సంక్షేమ అధికారులకు చెప్పింది. గురుగ్రామ్‌కు తీసుకువెళ్తానని నమ్మించిన తన తండ్రి సమీపంలోని గ్రామానికి తీసుకొచ్చాడని అనంతరం యమునా నదిపై ఉన్న పాంటూన్ బ్రిడ్జి వద్దకు తాము చేరుకోగానే అక్కడికి తన మామ కూడా వచ్చాడని ఇద్దరూ కలిసి మఫ్లర్‌తో గొంతు నులిమి నదిలోకి తోశారని పోలీసులకు తెలిపింది. బాలిక ఫిర్యాదు మేరకు వారిద్దరిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆ మైనర్ బాలికను హోంకు తరలించి నిందితుల కోసం గాలిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..