AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Attack: 25 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా.. నాకే సలామ్ పెట్టవా? అర్థరాత్రి ముంతాజ్ అహ్మద్ ఖాన్ గూండాగిరీ!

పాతబస్తీకి చెందిన ప్రజా ప్రతినిధి బరితెగించారు. ప్రజల కష్టాలను కడతేర్చాల్సిన ఎమ్మెల్యే.. ఓ పౌరుడిని.. అర్థరాత్రి దుర్బాషలాడుతూ.. చితకబాదాడు.

MLA Attack: 25 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా.. నాకే సలామ్ పెట్టవా? అర్థరాత్రి ముంతాజ్ అహ్మద్ ఖాన్ గూండాగిరీ!
Mla Attack
Balaraju Goud
|

Updated on: Dec 12, 2021 | 3:47 PM

Share

Charminar MLA Mumtaz Ahmed Khan attack: పాతబస్తీకి చెందిన ప్రజా ప్రతినిధి బరితెగించారు. ప్రజల కష్టాలను కడతేర్చాల్సిన ఎమ్మెల్యే.. ఓ పౌరుడిని.. అర్థరాత్రి దుర్బాషలాడుతూ.. చితకబాదాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇంతకీ అతను చేసిన తప్పల్లా సలాం చేయకపోవడమే. 25 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నాకే సలామ్​ పెట్టవా? అంటూ దుర్భాషలాడుతూ… ఓ యువకుడిని చార్మినార్​ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్​ఖాన్ చెంప పగులగొట్టాడు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ ప్రాంతంలో జరిగింది. ​

ఈ సంఘటన హుస్సేనీహాలం పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఎమ్మెల్యే దాడికి సంబంధించిన సీసీ టీవీ కెమెరా విజువల్స్​సోషల్​ మీడియాలో వైరల్ అయ్యాయి. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం…పాతబస్తీ చార్మినార్​ బస్టాండ్​వద్ద గులామ్​గౌస్​జిలానీ అనే యువకుడు ఆదివారం తెల్లవారుజామున 12.43 నిమిషాల సమయంలో తన ఇంటి అరుగు ముందు మరో వ్యక్తితో కలిసి కూర్చుని మాట్లాడుతున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన చార్మినార్​ఎమ్మెల్యే ముంతాజ్ అమ్మద్​ఖాన్​తన గన్‌మెన్లతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. గులామ్​గౌస్​జిలాని వద్దకు వచ్చిన ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్​ఖాన్​.. 25 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా… నాకు సలామ్​ పెట్టవా అంటూ దుర్భాషలాడాడు. నేను చూడలేదు అని.. అయినా ఎందుకు సలామ్​ పెట్టాలి అని యువకుడు ఎదురు ప్రశ్న వేయడంతో ఆవేశంతో ఊగిపోయిన ఎమ్మెల్యే యువకునిపై చెంపదెబ్బలు కొట్టాడు.

అయితే, ఎమ్మెల్యే గన్‌మెన్లు సైతం ఆ గులామ్​గౌస్ జిలానీని అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నటికి మరో సారి ఎమ్మెల్యే అతనిపైకి వెళ్లి దాడి చేశారు. దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే ఇల్లు.. బాధితుని ఇల్లు సమీపంలోనే ఉండడం.. క్షణాల్లో అప్పటికే ఎంఐఎం కార్యకర్తలు గులామ్​గౌస్ జిలానీ ఇంటికి పెద్ద ఎత్తున చేరుకోవడంతో చార్మినార్​బస్టాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇదంతా అక్కడే ఉన్న సి.సి కెమెరాలో నిక్షిప్తమయ్యింది. బాధితుడు గులామ్​గౌస్ జిలానీ తన దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యేపై, తనను రివాల్వర్​తో షూట్​ చేస్తానని ఎమ్మెల్యే బంధువు బెదిరించాడని హుస్సేనిహాలం పోలీస్​స్టేషన్‌లో గులామ్ గౌస్ ఫిర్యాదు చేశాడు. అనంతరం హైదరాబాద్​పార్లమెంటు సభ్యులు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఓవైసీ దృష్టికి తీసుకువెళ్లినట్లు బాధితుడు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసును నమోదు చేసుకున్న హుస్సేనీఆలం పోలీసులు.. బాధితున్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

కాగా, ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ దాడిలో యువకుడు జిలానీ తీవ్రంగా గాయపడ్డాడు. ఎడమ చెవి దవడ భాగంలో గాయాలు అయినట్లు ఉస్మానియా వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. ఎంఐఎం ఎమ్మెల్యే కావడంతో బేంబేలెత్తిపోతున్నారు హైదరాబాద్ పోలీసులు. సీసీటీవీలో రికార్డ్ అయిన దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో జిలానీ సోదరుడికి ఎమ్మెల్యే తనయుడికి మధ్య ఓ ఆస్తి విషయంతో తగాదాలు వున్నాయని తెలుస్తోంది.

Read Also…. Parliament winter sessions: ఒక బిల్లు పార్లమెంట్‌లో ఎలా చట్టంగా మారుతుంది? ఎంత సమయం పడుతుంది? పూర్తి వివరాలివే..

పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు
ఇంట్లో ఎలుకలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా తరిమికొట్టండి!
ఇంట్లో ఎలుకలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా తరిమికొట్టండి!
న్యాయం, ధర్మం, ఖాకీ బుక్ అందరికీ ఒకేలా ఉండాలిః కేటీఆర్
న్యాయం, ధర్మం, ఖాకీ బుక్ అందరికీ ఒకేలా ఉండాలిః కేటీఆర్
క్యాబేజీ వీరికి యమ డేంజర్‌.. తిన్నారో నేరుగా కైలాసానికే!
క్యాబేజీ వీరికి యమ డేంజర్‌.. తిన్నారో నేరుగా కైలాసానికే!
జెట్ స్పీడ్‌లో గోపీచంద్ నయ మూవీ షూటింగ్..
జెట్ స్పీడ్‌లో గోపీచంద్ నయ మూవీ షూటింగ్..