AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్తకు తగిన శాస్తి చేసిన భార్య.. దేహశుద్ధి చేసి..!

భర్త ఎంత వేధించినా ఓపిక ఉన్నంత వరకే భార్య సహిస్తుంది. విసుగెత్తి ఏదైనా జరగని అని తెగిస్తే మాత్రం మహాంకాలిలా మారుతుంది. వేధించిన భర్తకు ఓ భార్య దేహశుద్ధి చేసింది.

భర్తకు తగిన శాస్తి చేసిన భార్య.. దేహశుద్ధి చేసి..!
Jyothi Gadda
|

Updated on: Sep 16, 2020 | 6:59 PM

Share

భర్త ఎంత వేధించినా ఓపిక ఉన్నంత వరకే భార్య సహిస్తుంది. విసుగెత్తి ఏదైనా జరగని అని తెగిస్తే మాత్రం మహాంకాలిలా మారుతుంది. పనిపాట లేకుండా జులాయిగా తిరుగుతూ..భార్యను శారీరకంగా మానసికంగా వేధించిన భర్తకు ఓ భార్య దేహశుద్ధి చేసింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట్ గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ఇంటర్ చదువుతుండగా, రెండో వాడు 8 వ తరగతి చదువుతున్నాడు. అయితే, గత 20 ఏళ్లుగా భర్త ఏ పనీ పాట లేకుండా గ్రామంలో జులయిగా తిరుగుతుండేవాడు. అయితే, అల్లుడు ఏ పని చేయకపోవటంతో ఓ సారి అత్తింటి వారు డబ్బులు పోగు చేసి గల్ఫ్ పంపించారు. అక్కడైన ఏదైన పనిచేసి కుటుంబాన్ని పోషిస్తాడని ఆశపడ్డారు. కానీ, వారికి నిరాశే మిగులుస్తూ… పని చేతకాక అప్పు చేతపట్టుకుని తిరిగి వచ్చాడు. వచ్చిన నుంచి తాగుడుకు బానిసై భార్యను డబ్బుల కోసం వేధించసాగాడు. అయినా అత్తగారు భరిస్తూ సుమారు మూడు సార్లు 50 వేల చొప్పున ఇచ్చారు. అయినా అదనపు కట్నం కోసం వేధించడం, భార్యను తాగి వచ్చి కొట్టడం చేసేవాడు. ఇవన్నీ బాధలు భరించలేక 10 రోజుల క్రితం ఆ ఇల్లాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయినా అతనిలో మార్పు రాలేదు. చికిత్స తర్వాత కోలుకున్న ఆమె కుటుంబ సభ్యులతో కలిసి రెడ్డిపేట్ గ్రామానికి వెళ్లి భర్త నర్సింలుకు దేహశుద్ధి చేసింది. చెప్పుతో ఇష్టం వచ్చినట్టు చితకబాదింది.

Follow Us
బండ బూతులు తిట్టుకున్న ఒకే టీం ప్లేయర్స్.. PSLలో షాకింగ్ సీన్?
బండ బూతులు తిట్టుకున్న ఒకే టీం ప్లేయర్స్.. PSLలో షాకింగ్ సీన్?
4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ..
4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ..
సమ్మర్‌లో మామిడి పండ్లు లాగిస్తున్నారా?.. జాగ్రత్త వీరికి విషమే
సమ్మర్‌లో మామిడి పండ్లు లాగిస్తున్నారా?.. జాగ్రత్త వీరికి విషమే
ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో అప్డేట్
ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో అప్డేట్
ఈ గింజలు గ్లాసుడు నీళ్లలో ఓ స్పూన్ నానబెట్టి తాగితే ఉంటుంది సామీ!
ఈ గింజలు గ్లాసుడు నీళ్లలో ఓ స్పూన్ నానబెట్టి తాగితే ఉంటుంది సామీ!
వాస్తు టిప్స్ : మీ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పే సంకేతాలు ఇవే!
వాస్తు టిప్స్ : మీ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పే సంకేతాలు ఇవే!
నలుపు, తెలుపు, గోధుమ.. ఏ రంగు జుట్టు ఉన్నవారు అదృష్టవంతులో తెలుసా
నలుపు, తెలుపు, గోధుమ.. ఏ రంగు జుట్టు ఉన్నవారు అదృష్టవంతులో తెలుసా
భోజనం తర్వాత స్వీట్లు తినాలని ఎందుకు అనిపిస్తుంది?
భోజనం తర్వాత స్వీట్లు తినాలని ఎందుకు అనిపిస్తుంది?
'రామాయణం' టీజర్‌లో ఈ మిస్టేక్స్‌ను గమనించారా? వీడియో
'రామాయణం' టీజర్‌లో ఈ మిస్టేక్స్‌ను గమనించారా? వీడియో
వైసీపీ అధినేత జగన్‌కు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్..!
వైసీపీ అధినేత జగన్‌కు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్..!