Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి.. పలువురికి గాయాలు!
Road Accident: దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అధిక వేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, అజాగ్రత్త తదితర కారణాల వల్ల ప్రతి రోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.. తాజాగా జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు..
ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాలో దౌండీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌యూవీ, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన వారిలో మహిళలు, పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారిని మెరుగైన చికిత్స కోసం రాజ్‌నంద్‌గావ్ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు.
న్యూస్ ఏజెన్సీ ప్రకారం, ఒక ఎస్‌యూవీ, ట్రక్కు ఎదురుగా ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరుగగానే ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన ఏడుగురిని తొలుత స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని రాజ్‌నంద్‌గావ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మరో వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ప్రమాదంలో దుర్పత్ ప్రజాపతి (30), యువరాజ్ సాహు (30), నలుగురు మహిళలు సుమిత్రా బాయి కుంభకర్ (50), మనీషా కుంభకర్ (35), సగున్ బాయి కుంభకర్ (50), ఇమ్లా బాయి (55), ఏడుగురు మృతి చెందారు. అదే సమయంలో ప్రమాదంపై ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి