AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది మరీ టూ మచ్! భార్య మార్నింగ్ వాక్‌కు బయటకు వెళ్లిందని విడాకులు ఇచ్చిన భర్త!

మహారాష్ట్రలో ఓ విడాకులు చర్చనీయ అంశంగా మారింది. ఫోన్‌లోనే మూడుసార్లు తలాక్ చెప్పి వివాహ బంధాన్ని తెంచుకున్నాడు ఓ భర్త. ఇకపై మనం కలిసి ఉండలేం.. నీకు విడాకులు ఇస్తున్నానంటూ మూడు సార్లు తలాక్‌ చెప్పాడు.

ఇది మరీ టూ మచ్! భార్య మార్నింగ్ వాక్‌కు బయటకు వెళ్లిందని  విడాకులు ఇచ్చిన భర్త!
Morning Walk
Balaraju Goud
|

Updated on: Dec 16, 2024 | 7:44 PM

Share

మహారాష్ట్రలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. భార్య మార్నింగ్‌కు వెళ్లిందని విడాకులు ఇచ్చిన వింత కేసు వెలుగు చూసింది. థానేకు చెందిన ఓ యువకుడు తన భార్య ఒంటరిగా మార్నింగ్ వాక్‌కు వెళ్లాడన్న కారణంతో ఆమెకు విడాకులు ఇచ్చాడు. దేశంలో ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం అమలులోకి వచ్చినప్పటి ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. బాధితులు ఫిర్యాదుతో పోలీసులు రెండు రోజుల క్రితం శుక్రవారం(డిసెంబర్ 13) నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన థానేలోని ముంబ్రా ప్రాంతంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబ్రా ప్రాంతంలో నివసిస్తున్న 31 ఏళ్ల యువకుడికి 25 ఏళ్ల యువతితో వివాహమైంది. పెళ్లి తర్వాత వారి కాపురం అన్యోన్యంగా సాగింది. రోజూ ఉదయం, సాయంత్రం ఇద్దరూ కలిసి వాకింగ్‌కు వెళ్లేవారు. గత మంగళవారం(డిసెంబర్ 10) యువకుడి భార్య మార్నింగ్ వాక్ కోసం ఒంటరిగా బయటకు వెళ్లింది. ఈ విషయం యువకుడికి నచ్చకపోవడంతో అతడు తీవ్ర ఆగ్రహంతో తన భార్యకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. అంతేకాదు తన మామగారికి ఫోన్ చేసి తలాక్-ఏ-బిద్దత్ గురించి చెప్పాడు.

ఈ సంఘటనకు సంబంధించి నిందితులను ఒప్పించేందుకు అతని మామ చాలా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోవడంతో అతను తన కుమార్తెతో పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 351-4 ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేశారు. ముస్లిం వివాహ చట్టం. దేశంలో ట్రిపుల్ తలాక్ నిరోధక చట్టం అమల్లో ఉందని పోలీసులు తెలిపారు. దీంతో కేసు తీవ్రత దృష్ట్యా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

దేశంలో ట్రిపుల్ తలాక్ చట్టం వచ్చినప్పటికీ, ఇలాంటి ఉదంతాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ చట్టం అమలుకు ముందు, సాధారణంగా ఇటువంటి సంఘటనలు తక్కువ. కానీ చట్టం అమలు తర్వాత, ఇటువంటి కేసులు చర్చలోకి రావడమే కాకుండా, ఈ కేసులపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి కేసులు ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లో కనిపిస్తున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..