AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India: ఆ నగరంలో భిక్షాటన చేయడమే కాదు.. డబ్బులు ఇవ్వడం కూడా నేరమే.. కేసు నమోదు.. ఎక్కడంటే..

ప్రస్తుతం ఇన్ కం టాక్స్ లేని బిజినెస్ ఏదైనా ఉంటె అది బిక్షాటన అని చెప్పవచ్చు అని అంటున్నారు చాలా మంది. ఎందుకంటే అనేక ప్రాంతాల్లోని బిచ్చగాళ్ళు కొతీశ్వరులే.. అని తెలియజేసే అనేక సంఘటనలు తరచుగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. రోడ్డు దగ్గర, గుళ్ళలో ఇలా ఎక్కడబడితే అక్కడ బిచ్చగళ్ళు కనిపిస్తూ వారు చేసే హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే తాజాగా మన దేశంలో ఒక నగరం బిచ్చగాళ్ళ రహితంగా ఉండాలని కోరుకుంటుంది. అందుకనే ఏకంగా భిక్షాటనను నిషేధిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

India: ఆ నగరంలో భిక్షాటన చేయడమే కాదు.. డబ్బులు ఇవ్వడం కూడా నేరమే.. కేసు నమోదు.. ఎక్కడంటే..
Indore Begger NewsImage Credit source: Getty
Surya Kala
|

Updated on: Dec 16, 2024 | 8:42 PM

Share

భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరమైన ఇండోర్. ఇప్పుడు ఆ నగరం సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టాలని కోరుకుంటుంది. తమ నగరం బిచ్చగాళ్ళు లేని నగరంగా ఉండాలని కోరుకుంటోంది. వీధులు బిచ్చగాళ్ళు లేకుండా ఉండేలా ఒక తీవ్రమైన చర్యను చేపట్టాలని కూడా నిర్ణయించింది. కొత్త ఏడాది 2025 ఎంట్రీ రోజైన జనవరి 1 నుంచి జిల్లా యంత్రాంగం సరికొత్త చట్టాన్ని అమలులోకి తీసుకుని రానుంది. తమ నగరంలోని యాచకులకు ఎవరైనా డబ్బులు ఇస్తే వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయనున్నారు.

ఇండోర్‌లో భిక్షాటనను నిషేధిస్తూ పరిపాలన అధికారులు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే విషయంపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ భిక్షాటనపై మా చైతన్య యాత్ర ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని చెప్పారు. 2025 జనవరి 1 నుంచి ఎవరైనా భిక్షాటన చేస్తూ కనిపిస్తే వారిపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేస్తామని తెలిపారు. ప్రజలు అన్నదానం, డబ్బులు ఇచ్చి ఈ పాపంలో భాగస్వాములు కావద్దని ఇండోర్ నివాసితులందరికీ తాను విజ్ఞప్తి చేస్తున్నాను” అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ తెలిపారు.

బిచ్చగాళ్లకు పునరావాసం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పైలట్ ప్రాజెక్టు కింద ఇండోర్ వీధులను యాచకుల రహితంగా మార్చేందుకు ప్రయత్నాలు శర వేగంగా చేస్తున్నారు. ఈ పైలెట్ ప్రాజెక్ట్ లో భాగంగా 10 నగరాలు ఉన్నాయి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇండోర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పాట్నా, అహ్మదాబాద్ ఈ నగరాల్లో బిచ్చగాళ్లకు పునరావాసం కల్పించే నగరాలుగా ఎంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

యాచక వృత్తికి వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారంలో భాగంగా ఇండోర్ నగర పరిపాలన అధికారులు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ ఆఫీసర్ దినేష్ మిశ్రా మాట్లాడుతూ, “మేము నివేదికలు సిద్ధం చేసినప్పుడు షాకింగ్ విషయాలు తెలిశాయని.. నగరంలోని కొంతమంది బిచ్చగాళ్లకు పక్కా ఇల్లు, భారీగా డబ్బులున్నాయని.. మరికొందరి పిల్లలు బ్యాంకులో పనిచేస్తున్నారని చెప్పారు. ఒకసారి తాము ఒక బిచ్చగాడి వద్ద 29,000 రూపాయలను చూశామని చెప్పారు. మరొక బిచ్చగాడు డబ్బులను అప్పుగా ఇస్తూ వడ్డీకి తిప్పుతున్నాడు. ఇండోర్ లో భిక్షాటన చేయడానికి రాజస్థాన్ నుంచి ఒక ముఠా వచ్చింది. కొంత మంది పిల్లలతో ఒక హోటల్ లో బస చేసినట్లు తాము గుర్తించమని చెప్పారు.

ఈ విషయంపై మధ్యప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నారాయణ్ సింగ్ కుష్వాహా మాట్లాడుతూ ఇండోర్‌కు చెందిన ఒక సంస్థ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుని ప్రకటించి ముందుకు వచ్చింది. బిక్షాటన చేస్తున్న వారికి ఆరు నెలల పాటు ఆశ్రయం కల్పించి వారికి పని కల్పించేందుకు సంస్థ ప్రయత్నిస్తుందని చెప్పారు. ప్రజలను భిక్షాటన నుంచి విముక్తి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..