AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పిల్లలు కలుగుతారని బతికున్న కోడిపిల్లను మింగాడు.. కట్ చేస్తే..

నాన్న అని పిలిపించుకోవాలన్నది అతని కోరిక.. తిరగని ఆస్పత్రి లేదు.. మొక్కని దేవుడు లేడు. ఏం చేసినా ఫలితం లేదని.. చివరకు క్షుద్రపూజలు చేసే ఓ మాంత్రికుడ్ని సంప్రదించాడు. ఆ తర్వాత...

Viral: పిల్లలు కలుగుతారని బతికున్న కోడిపిల్లను మింగాడు.. కట్ చేస్తే..
Chicken
Ram Naramaneni
|

Updated on: Dec 16, 2024 | 8:20 PM

Share

పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగకపోతే దంపతులు తీవ్ర నైరాశ్యంలో ఉంటారు. ఎవరు ఏ డాక్టర్లు వద్దకు వెళ్లమని చెప్పినా.. ఏ గుడిలో పూజలు చేపించమన్నా.. ఫాలో అయిపోతారు. ఇంతవరకు ఓకే.. మరీ క్షుద్రపూజల వరకు వెళ్లడం మాములు విషయం కాదు. ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజాలో అలాంటి ఘటనే జరిగింది. పూజల్లో భాగంగా ఆ వ్కక్తి.. కోడిపిల్లను మింగబోయి ప్రాణాలు కోల్పోయాడు. తొలుత గుండెపోటుతో యువకుడు మృతి చెంది ఉంటాడని డాక్టర్లు భావించారు. అయితే పోస్ట్‌మార్టం చేయగా… గొంతులో చనిపోయిన కోడిపిల్ల కనిపించడంతో స్టన్ అయ్యారు.

అంబికాపూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధి చింద్‌క గ్రామానికి చెందిన ఆనంద్ కుమార్ యాదవ్ (36)కు పెళ్లై ఐదేళ్లు అయినా సంతానం కలగడం లేదు. దీంతో అతను ఓ మంత్రగాడిని ఆశ్రయించాడు.  ఆ తాంత్రికుడి సూచన మేరకు క్షుద్ర పూజల అనంతరం.. బతికి ఉన్న కోడి పిల్లను మింగే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ కోడిపిల్ల గొంతులో స్ట్రక్ అయింది. దీంతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. 15,000 శవపరీక్షలలో తాను ఇలాంటి కేసును చూడలేదని.. పోస్ట్‌మార్టం నిర్వహించిన ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ సంతు బాగ్ తెలిపారు.

ఆనంద్ మరణంపై అంబికాపూర్ హాస్పిటల్ ఫోరెన్సిక్ హెచ్‌వోడీ డాక్టర్ వివరాలు వెల్లడించారు.. ఆదివారం బాధితుడ్ని తమ వద్దకు తీసుకువచ్చారని.. అతను గుండెపోటుతో చనిపోయి ఉండవచ్చని తొలుత భావించామన్నారు. ఆ తర్వాత మరణంపై క్లారిటీ కోసం పోస్ట్‌మార్టం చేయగా.. అతను గుండెపోటుతో చనిపోలేదని వెల్లడైంది. దీంతో పూర్తి స్థాయిలో చెకప్ చేయగా.. గొంతులో కోడిపిల్లను గుర్తించారు.  అది ఆనంద్ శ్వాసనాళానికి, అన్నవాహికకు మధ్య ఇరుక్కుపోయింది. దీని కారణంగా అతడు చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకని విచారణ చేస్తున్నారు.

ఆనంద్ ఎప్పుడు కోడి పిల్లను తీసుకొచ్చి మింగాడనే విషయం తమకు తెలియదని కుటుంబ సభ్యులు తెలిపారు. “పోస్ట్‌మార్టంలో నిజం వెల్లడయ్యే వరకు ఆ విషయం గురించి మాకు తెలియదు” అని బంధువు వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.