AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఎక్కడ నుంచి వస్తాయి ఈ ఐడియాస్.. చికెన్ ప్రియులకు షాక్ ఇచ్చేలా చికెన్ టిక్కా చాక్లెట్‌ తయారీ..

ఓ వ్యక్తి చికెన్ టిక్కా చాక్లెట్‌ను తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో నిజానికి జర్మనీకి చెందిన రెస్టారెంట్ యజమాని షేర్ చేశాడు. ఈ వీడియోపై భినాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయినా సరే లక్షణాది వ్యూస్ ని సొంతం చేసుకుంది.

Viral Video: ఎక్కడ నుంచి వస్తాయి ఈ ఐడియాస్.. చికెన్ ప్రియులకు షాక్ ఇచ్చేలా చికెన్ టిక్కా చాక్లెట్‌ తయారీ..
Viral Video
Surya Kala
|

Updated on: Dec 16, 2024 | 8:42 PM

Share

కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత్ సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. డ్యాన్స్ చేస్తున్న వీడియోలు రకరకాల వంటలు తయారు చేస్తున్న వీడియోలు నెట్టింట్లో ప్రత్యక్షం అవుతున్నాయి. కొన్ని వంటలకు సంబంధించిన వీడియోలు ఆకట్టుకుంటే.. మరికొన్ని బాబోయ్ వంటలతో ఇలాంటి ప్రయోగాలు చేసి తినే తిండి మెడ విరక్తి తెప్పిస్తున్నారు అంటూ వాపోతున్నారు కూడా. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి చికెన్ టిక్కా చాక్లెట్‌ను తయారు చేస్తున్నాడు. ప్రస్తుతం వైరల్‌ అవుతున్న వీడియో క్లిప్ నిజానికి జర్మనీకి చెందిన రెస్టారెంట్ యజమాని షేర్ చేశాడు.

ఫ్యూజన్ డెజర్ట్‌కి భోజనప్రియులు షాక్

ప్రయోగాత్మకం అంటూ తినే ఆహారం పై రకరకాల ప్రయోగాలూ చేస్తున్నారు. అయితే చికెన్ ప్రియులకు షాక్ ఇస్తూ ఓ వ్యక్తి చికెన్ తో చికెన్ టిక్కాను తయారు చేస్తూ అందులో చాక్లెట్‌తో కలుపుతున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వినియోగదారు షేర్ చేసిన వీడియో భోజన ప్రియులను షాక్‌కు గురి చేసింది. ఈ డెజర్ట్ ని తయారు చేసే వ్యక్తీ ముందుగా ఫుడ్ కలరింగ్‌ను చాక్లెట్ మౌల్డ్‌లో చల్లుతున్నప్పుడు మొదలైంది. తర్వాత కరిగిన వైట్ చాక్లెట్‌ను అచ్చుపై పొరలుగా చేసి చికెన్ టిక్కాతో నింపాడు. తర్వాత చాక్లెట్ మరొక పొరతో క్లోజ్ చేశాడు. కొన్ని గంటలపాటు దానిని ఫ్రీజ్ చేశాడు. అది గడ్డకట్టిన తర్వాత ఎవరూ ఊహించని స్వీట్, చికెన్ కలిపిన ఫ్యూజన్ డెజర్ట్ రెడీ అయింది.

ఇవి కూడా చదవండి

తన పాక శాస్త్ర ప్రయోగాన్ని కెమెరాలో బంధించాడు. ఈ వీడియో షేర్ చేస్తూ “చికెన్ టిక్కా చాక్లెట్ గురించి మీ ఆలోచనలు ఏమిటి?” అనే శీర్షికని జత చేశాడు. ఒరిజనల్ వీడియో పంజాబ్‌కు చెందిన జర్మన్ ఆధారిత రెస్టారెంట్ యజమాని షేర్ చేశాడు. ఈ వింత వంటకం పేరు “దుబాయిస్ స్కోకోలేడ్ చికెన్ టిక్కా మసాలా” అని తెలుస్తోంది.

వీడియోను ఇక్కడ చూడండి:

ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలతో సోషల్ మీడియా ఓ యుద్ధభూమిగా మారింది. అయినా సరే ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ ను సొంతం చేసుకుంది. చికెన్ అంటే ఇష్టం ఉన్నవారు మాత్రం తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?