AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire Accident: హిమాచల్ ప్రదేశ్​లో ఘోర అగ్నిప్రమాదం…27 ఇళ్లు, పురాతన ఆలయం, 26 గోశాలలు దగ్ధం..!

హిమాచల్ ప్రదేశ్ ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కుల్లూ జిల్లాలోని మజాణ్​ గ్రామంలో జరిగిన ఈ ప్రమాదంలో 27 ఇళ్లతో పాటు రెండు దేవాలయాలు అగ్నికి ఆహుతి అయ్యాయి.

Fire Accident: హిమాచల్ ప్రదేశ్​లో ఘోర అగ్నిప్రమాదం...27 ఇళ్లు, పురాతన ఆలయం, 26 గోశాలలు దగ్ధం..!
Fire Accident
Balaraju Goud
|

Updated on: Dec 12, 2021 | 4:50 PM

Share

Himachal Pradesh fire Accident: హిమాచల్ ప్రదేశ్ ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కుల్లూ జిల్లాలోని మజాణ్​ గ్రామంలో జరిగిన ఈ ప్రమాదంలో 27 ఇళ్లతో పాటు రెండు దేవాలయాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. దేవాలయాలను ఆనుకుని ఉన్న 26 గోశాలలు దగ్దమయ్యాయి. దాదాపు రూ.9 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు స్థానిక అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. షార్ట్​ సర్క్యూట్​ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఈ ఘటనపై సీఎం జైరామ్​ ఠాకూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. కాగా, ఈ ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఒక ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంలో మంటలు వ్యాపించాయి. ఇళ్లల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో.. జనం భయంతో పరుగులు తీశారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ఘటనలో రాయ్ నాగ్ దేవత అనే పురాతన ఆలయం దగ్ధమైంది. శరీరంపై వేసుకున్న బట్టలు తప్ప ఏమీ మిగల్లేదని మజాన్ గ్రామస్థులు వాపోయారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదని అధికారులు తెలిపారు.

ప్రమాదం జరిగిన ప్రాంతం ప్రధాన రహదారికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. సరైన రవాణా మార్గం లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడానికి మూడు గంటల సమయం పట్టిందని స్థానికులు తెలిపారు. అదేవిధంగా గ్రామంలో నీటివసతి కూడా లేకపోవడంతో ప్రజలు మంటలను ఆర్పడానికి బురద చల్లడం, రాళ్లు విసరడం వంటి చేశారన్నారు. దీంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు.

Read Also… Crime News: క్షణికావేశం ఒకరి ప్రాణాలు తీసింది.. పెళ్లి రోజు వేడుక చేసుకుందామన్న భార్యను హతమార్చిన భర్త!

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!