హిందూపురం పట్టణ శివారులో హిజ్రా దారుణ హత్య.. గోంతు కోసి.. డిజీల్ పోసి నిప్పటించారు
అనంతపురం జిల్లా హిందూపురం శివారులో దారుణం చోటుచేసుకుంది. కొట్నుర్ కొల్లగుంట గ్రామాల మధ్య గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు అతికిరాతకంగా గొంతు కోసి హత్య చేసి...

అనంతపురం జిల్లా హిందూపురం శివారులో దారుణం చోటుచేసుకుంది. కొట్నుర్ కొల్లగుంట గ్రామాల మధ్య గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు అతికిరాతకంగా గొంతు కోసి హత్య చేసి… ఆపై డీజిల్ పోసి నిప్పంటించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు..మరణించిన వ్యక్తి హిజ్రా అని వన్ టౌన్ సీఐ మద్దిలేటి బాల తెలిపారు. మృతదేహాన్ని హిందూపురం గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
క్షణికావేశంలో భర్తను హత్య చేసిన భార్య…
విశాఖలోని 1వ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. తనను తాను రక్షించుకునే క్రమంలో ఇనుపరాడ్డుతో భర్త తలపై మోదీ హత్య చేసింది భార్య. వివరాల్లోకి వెళ్తే.. విశాఖలోని 35వ వార్డు ద్వారంవారివీధిలో పూసర్ల పుండరీకాక్ష, పుణ్యవతి దంపతులు నివశిస్తున్నారు. వాళ్లకు కుమార్తె(18), కుమారుడు(14) ఉన్నారు. పుండరీకాక్ష టిఫిన్ బండి నడుపుతూ.. ఏవైనా ఈవెంట్లు ఉంటే క్యాటరింగ్ చేసేవాడు. ఈ క్రమంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం భార్యకు తెలియడంతో ఇద్దరి మధ్య నిత్యం గొడవలు జరిగేవి. పుండరీకాక్ష.. భార్య, పిల్లలను ఎప్పుడూ కొడుతూ ఉండేవాడు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ఇద్దరికీ కౌన్సెలింగ్ తిరిగి పంపించివేశారు.
ఈనెల 10న భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో ఇద్దరి పిల్లలను తీసుకోని కురుపాం మార్కెట్‌లోని తన పుట్టింటికి వెళ్లింది. తిరిగి ఈనెల 18న పిల్లలతో కలిసి ఇంటికి వచ్చింది. అదే రోజు రాత్రి ఇద్దరి మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. దీంతో పుణ్యవతి.. పిల్లలను వంట గదిలో పెట్టి గడియ వేసింది. భార్యాభర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో పుణ్యవతి తనను తాను రక్షించుకునే క్రమంలో ఇనుపరాడ్డుతో భర్త పుండరీకాక్ష తలపై బలంగా దాడి చేసింది. దీంతో అతను స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు.
New Traffic Rules: మీ కొడుకు మైనరైనా వాహనం ఇస్తున్నారా..? అయితే మీరు కూడా జైలుకు సిద్దమవ్వండి