Crime News: రెండున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష.. 28 రోజుల్లో తీర్పు వెలువరించిన కోర్టు

రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను గుజరాత్‌లోని సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించింది. నిందితుడికి మరణశిక్ష విధిస్తూ మంగళవారం కోర్టు తీర్పునిచ్చింది.

Crime News: రెండున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష.. 28 రోజుల్లో తీర్పు వెలువరించిన కోర్టు
Judgement
Follow us

|

Updated on: Dec 07, 2021 | 4:50 PM

Gujarat Death Sentenced of Rape Case: రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను గుజరాత్‌లోని సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించింది. నిందితుడికి మరణశిక్ష విధిస్తూ మంగళవారం కోర్టు తీర్పునిచ్చింది. ఘటన అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిపై 7 రోజుల్లో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో 246 పేజీల చార్ట్ షీట్‌ను పోలీసులు కోర్టులో సమర్పించారు. అదే సమయంలో.. ఈ కేసుపై కోర్టు కేవలం 28 రోజుల్లో తీర్పు ఇచ్చింది.

సూరత్‌లోని పండేసర ప్రాంతంలో అత్యాచార ఘటన చోటుచేసుకుంది. పందేసర తహసీల్‌లోని ఒక గ్రామానికి చెందిన రెండున్నరేళ్ల చిన్నారిపై అదే ప్రాంతానికి చెందిన గుడ్డు యాదవ్ అనే కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీపావళి రోజు రాత్రి ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని తీసుకెళ్లాడు. చాక్లెట్లు ఇప్పిస్తానని బాలికను రప్పించాడు. ఆ తర్వాత సాకుతో ఆమెను పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అఘాయిత్యానికి పాల్పడిన అనంతరం బాలిక నోరు నొక్కి హత్య చేశాడు దుర్మార్గుడు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత, బాలిక మృతదేహాన్ని పొదల్లోంచి అపస్మారక స్థితిలో వెలికితీశారు.

తాజాగా మరో దారుణం వెలుగుచూసింది. గుజరాత్‌లోనే అత్యాచారానికి పాల్పడిన మరో వ్యక్తిపై చర్యలు తీసుకున్నారు. అత్యాచారం ఆరోపణలపై ఇన్ఫోసిటీ పోలీసులు విపుల్ రావల్ (33)ని అరెస్టు చేశారు. గాంధీనగర్ ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేశాడని అతనిపై ఆరోపణ ఉంది. ఇన్ఫోసిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కార్మిక కుటుంబానికి చెందన బాధితురాలిని.. విపుల్ రావల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పదే పదే బాధితురాలిని బలిపశువుగా చేసుకున్నాడు. పలుమార్లు బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. దీంతో బాధితురాలి తల్లి ఇన్ఫోసిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడి కోసం గాలింపు ప్రారంభించినట్లు ఇన్ఫోసిటీ పోలీసు అధికారి తెలిపారు. తాజాగా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Read Also…  Gadget Guru: అర్జెంటుగా మీ పిసి అప్డేట్ చెయ్యండి.. లేకపోతే మీ డేటా గల్లంతే !! వీడియో