Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మరీ ఇంత తెగింపా.. ప్రేమ వద్దన్నందుకు సూపారీ ఇచ్చి తండ్రినే చంపించిన మైనర్ బాలిక..

Girl murder her Father: మానవత్వం మంట గలుస్తోంది.. ప్రియుడితో ప్రేమ వద్దని చెప్పినందుకు ఏకంగా కన్నతండ్రినే హత్య చేయిందో బాలిక. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని కుషాయిగూడలో

Hyderabad: మరీ ఇంత తెగింపా.. ప్రేమ వద్దన్నందుకు సూపారీ ఇచ్చి తండ్రినే చంపించిన మైనర్ బాలిక..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 13, 2021 | 1:03 PM

Girl murder her Father: మానవత్వం మంట గలుస్తోంది.. ప్రియుడితో ప్రేమ వద్దని చెప్పినందుకు ఏకంగా కన్నతండ్రినే హత్య చేయిందో బాలిక. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని కుషాయిగూడలో జరిగింది. తండ్రిని చంపేందుకు సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించింది. తన ప్రేమకు అడ్డుచెప్తున్నాడని.. ఆ బాలిక, ప్రియుడు, సుపారీ గ్యాంగ్‌ కలిసి హత్యచేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ షాకింగ్‌ సంఘటన జూలైలో జరిగింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టగా షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్‌ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. పల్సం రామకృష్ణ (49) భార్య, కూతురుతో కాప్రాలో నివాసం ఉంటూ స్థానిక గ్యాస్‌ ఏజెన్సీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో గత జూలై 20న తలకు బలమైన గాయాలతో రామకృష్ణను ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి నుంచి మరో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇంట్లో జారిపడి తలకు గాయమైందని కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పడంతో చేకేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే.. రామకృష్ణ పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గొంతు నులిమి చంపినట్లుగా, బలంగా కొట్టినట్లుగా గాయాలు ఉన్నట్లు తేలింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు మృతుడి భార్య, కుటుంబసభ్యులను విచారించారు. దీంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

గతంలో నారాయణగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మృతుడి కుటుంబం నివసించేది. రామకృష్ణ కూతురు అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌ కొడుకు చెట్టి భూపాల్‌ (20)తో ప్రేమలో పడింది. విషయం తెలిసిన బాలిక తండ్రి పలుమార్లు మందలించాడు. ఈ క్రమంలో భూపాల్‌ ఆ బాలికకు మాయమాటలు చెప్పి రామకృష్ణ ఇంట్లో ఉన్న రూ.1.75 లక్షలు చోరీ చేశాడు. దీనిపై రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు భూపాల్‌ను రిమాండ్‌ తరలించారు. అయితే.. రామకృష్ణ కూతురు ప్రేమ వ్యవహారం బయటపడుతుందని.. కాప్రాకు మకాం మార్చాడు. అనంతరం జైలు నుంచి విడుదలైన భూపాల్‌ తిరిగి బాలికతో మాట్లాడటం మొదలుపెట్టాడు. అతడినే పెళ్లి చేసుకోవాలని బాలిక నిర్ణయించుకొని.. ప్రేమకు అడ్డుగా ఉన్న రామకృష్ణను హత్యచేయాలని భావించింది. దీనికోసం.. ప్రియుడు భూపాల్‌ తన ఇద్దరు మిత్రులతో కలసి రామకృష్ణ హత్యకు ప్లాన్‌ వేశాడు. మత్తు గొలీలతో స్పృహ తప్పేటట్లు చేసి.. చంపాలని నిర్ణయించుకున్నారు.

జూలై 19 సాయంత్రం మత్తుగోలీల పౌడర్‌ను బాలికకు అందజేశారు. ఆమె కోడి కూరలో మత్తు మందు కలిపింది. దీంతో తల్లిదండ్రులు నిద్రలోకి వెళ్లిపోయారు. భూపాల్‌ తన మిత్రులతో కలిసి అర్ధరాత్రి బాలిక ఇంటికి చేరుకొని హత్యచేశారు. రామకృష్ణ ముఖంపై భూపాల్, గణేష్‌ బ్లాంకెట్‌ వేసి అదిమిపట్టుకోగా, ప్రశాంత్‌ కత్తితో తలపై బలంగా పొడిచాడు. నొప్పితో రామకృష్ణ మేల్కొగా.. అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. అనంతరం ఆసుపత్రికి తరలించగా.. రామకృష్ణ చికిత్స పొందుతూ మరణించాడు.

కూతురి ప్రేమ విషయం బయటకు వస్తుందన్న ఆలోచనతో మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పకుండా దాచినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి హత్యకు పాల్పడిన కూతురు, ఆమె ప్రియుడు భూపాల్, గణేష్, ప్రశాంత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారితోపాటు ప్రశాంత్‌ను రక్షించాలనే ప్రయత్నం చేసిన అతడి తండ్రి విజయ్‌పాల్‌ను కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

Insurance Crime: రూ.23 కోట్ల బీమా డబ్బు కోసం రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు.. చివరకు సీన్‌ రివర్స్‌..

Ketchup on Space: మార్స్ మట్టిలో పండే టమోటాల నుంచి కచప్ రెడీ.. ఇంట్రస్టింగ్ విశేషాలు మీకోసం..