Vizag: పైనుంచి చూస్తే పక్కా పైనాపిల్ లోడే అనుకుంటారు.. లోపల చెక్ చేస్తే మైండ్ బ్లాంక్

విశాఖ జిల్లా మాడుగులలో పైనాపిల్​ లోడ్ మాటున​ లారీలో రహస్యంగా తరలిస్తున్న భారీ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఒడిశాకు....

Vizag: పైనుంచి చూస్తే పక్కా పైనాపిల్ లోడే అనుకుంటారు.. లోపల చెక్  చేస్తే మైండ్ బ్లాంక్
Pine Apple Load
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 06, 2021 | 6:13 PM

విశాఖ జిల్లా మాడుగులలో పైనాపిల్​ లోడ్ మాటున​ లారీలో రహస్యంగా తరలిస్తున్న భారీ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్​ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. మాడుగుల మండలం గరికబంధ చెకుపోస్టు వద్ద పక్కా సమాచారం మేరకు మాడుగుల ఎస్సై రామారావు ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు చెకింగ్ చేస్తుండగా.. పాడేరు నుంచి పైనాపిల్ లోడుతో వస్తున్న లారీని ఆపి.. తనిఖీ చేశారు. లారీలో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది.  గంజాయి లారీని పోలీస్ స్టేషనుకు తరలించారు. పట్టుబడిన గంజాయి రెండు వేల కేజీలకుపైగా ఉండవచ్చని.. దీని విలువ కోటి రూపాయలు ఉంటుందని వివరించారు. అనంతరం సీఐ మహ్మద్ పట్టుబడిన గంజాయిని పరిశీలించారు.

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో భారీగా గంజాయి స్వాధీనం

బొబ్బిలి మండలం డొంగురువలస మామిడి తోటలో గుర్తుతెలియని వ్యక్తులు పడేసిన రూ.అర కోటి విలువ చేసే గంజాయిని పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బొబ్బిలికి చెందిన దామెర కృష్ణబాబుకు చెందిన డొంగురువలసలోని మామిడి తోటలో గుర్తు తెలియని వ్యక్తులు ఏవో సంచులు వదిలివెళ్లారని.. అక్కడ పనిచేసే శంకరరావు పోలీసులకు కంప్లైట్ చేశారు. ఆ మేరకు సోదాలు చేయగా బస్తాల్లో గంజాయి పొట్లాలు ఉన్నట్లు గుర్తించారు.  వాటికి తూకం వేయగా 792 కేజీలు ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల మేరకు వీటి విలువ రూ.అర కోటి ఉంటుందని, బయట మార్కెట్లో రూ.కోటిన్నర వరకు పలికే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. గంజాయిని సీజ్‌ చేసినట్లు వెల్లడించారు. ఒడిశా నుంచి వచ్చినట్లు భావిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

Also Read:ఆ ఊర్లో ఆదిమానవుడి జాడలు.. ఆసక్తి రేపుతోన్న అక్కడి సమాధులు

రోడ్డుపై జెర్రిపోతు హల్‌చల్.. ఏకంగా అరగంట ట్రాఫిక్ ఆపేసింది