Snake Hulchal: రోడ్డుపై జెర్రిపోతు హల్‌చల్.. ఏకంగా అరగంట ట్రాఫిక్ ఆపేసింది

ఆ రూట్లో ట్రాఫిక్ జామ్ అయింది. అటు వైపు వాహనాలు ఇటు రావడం లేదు.. ఇటు వాహనాలు అటు వెళ్లడం లేదు. సుమారు...

Snake Hulchal: రోడ్డుపై జెర్రిపోతు హల్‌చల్.. ఏకంగా అరగంట ట్రాఫిక్ ఆపేసింది
Snake Hulchal
Follow us

|

Updated on: Aug 06, 2021 | 5:24 PM

ఆ రూట్లో ట్రాఫిక్ జామ్ అయింది. అటు వైపు వాహనాలు ఇటు రావడం లేదు.. ఇటు వాహనాలు అటు వెళ్లడం లేదు. సుమారు అరగంటకు పైగా ఎక్కడి వాహనాలు అక్కడే జామ్ అయ్యాయి. అదేంటి ఏదైనా యాక్సిడెంట్ జరిగి ట్రాఫిక్ ఏమైనా జామ్ అయిందా అదీ లేదు. మరి వాహనాలు ఎందుకు ఆగాయి అంటే.. అవి ఆగలేదు.. వాటిని ఒక పాము ఆపేసింది. పామేంటి వాహనాలు ఆపడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారు. అయితే దిగువన వీడియోపై ఓ లుక్కేయండి.

అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం కప్పలబండ గ్రామ సమీపంలో నడిరోడ్డుపై పట్టపగలు ఒక పాము హడలెత్తించింది. సాధారణంగా గోరంట్ల- పుట్టపర్తి మార్గంలో నిత్యం వాహనాల రాకపోకలు ఉంటాయి. అలాంటి బిజీ రోడ్డు పైకి మధ్యాహ్న సమయంలో పొడవైన పాము వచ్చింది. అయితే రోడ్డు దాటి వెళ్తుందనుకుంటే.. అది వెళ్లలేదు.. అదేదో తన రాజ్యం అన్నట్టు.. రోడ్డుపై ఆగింది. దీనిని చూసిన వాహనదారులు భయంతో అక్కడే ఆగిపోయారు. పాము రోడ్డుకి అడ్డంగా ఉండడంతో వరుసగా అటు వైపు ఇటు వైపు వాహనాలను నిలిపేశారు. అరగంట పాటు రోడ్డుపై పాము (జెర్రిపోతు) వాహన దారులను అలాగే ఆపేసింది. ఎవరైనా దగ్గరికి వెళ్దామనంటే.. ఆ పాము సైజ్ చూసి మనకెందుకు వచ్చిందిలేరా బాబు అని అలా చూస్తు ఉండిపోయారు. చివరికి ఒక బస్సు డ్రైవర్ భారీగా గట్టిగా హారన్ కొట్టడంతో ఆ పాము రోడ్డు క్రాస్ చేసి చెట్లలోకి వెళ్లి పోయింది. దీంతో వాహన దారులు ఊపిరి పీల్చుకుని వెళ్లిపోయారు. అయితే సాధారణంగా జెర్రిపోతు.. చీమ చిటుక్కుమన్నా కూడా వెంటనే పారిపోతుంది. కానీ అంతమంది జనం అక్కడున్నా అది అక్కడే ఉండటం ఆశ్యర్యంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.

Also Read:ముగిసిన ఏపీ కేబినెట్ మీటింగ్.. కీలక నిర్ణయాలు ఇవే..

 తప్పు.. తప్పు.. రూటు మార్చిన పూజారి.. భక్తులకు అడ్డంగా దొరికిపోయాడు

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!