AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ మీటింగ్.. కీలక నిర్ణయాలు ఇవే..

ఏపీ సీఎం వైఎస్‌ జగన్ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. పలు కీల‌క అంశాల‌పై నిర్ణయాలు తీసుకున్నారు. నవరత్నాల...

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ మీటింగ్.. కీలక నిర్ణయాలు ఇవే..
Cm Jagan
Ram Naramaneni
|

Updated on: Aug 06, 2021 | 5:51 PM

Share

ఏపీ సీఎం వైఎస్‌ జగన్ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. పలు కీల‌క అంశాల‌పై నిర్ణయాలు తీసుకున్నారు. నవరత్నాల పథకాల అమ‌లు, జగనన్న విద్యాకానుక, నాడు-నేడు, శాటిలైట్‌ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్ల ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చించారు.ఈ నెల 10న అమలు చేయనున్న వైఎస్ఆర్‌ నేతన్న నేస్తం పథకంపై కూడా చర్చించారు. పులిచింతల ప్రాజెక్ట్‌ గేటు విరిగిన అంశంపై కేబినెట్‌లో చర్చించారు.  20 నిముషాల పాటు స్టాప్ లాక్ గేటు, హైడ్రాలిక్ గేట్ల ఏర్పాటుపై సమావేశంలో చర్చ జరిగింది.

కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే…

  • నూతన విద్యావిధానం ప్రకారం స్కూళ్లను 6 రకాలుగా వర్గీకరణ ఖరారుi. శాటిలైట్‌ స్కూల్స్‌ ( పీపీ–1, పీపీ–2) ii. ఫౌండేషన్‌ స్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2, 1, 2) iii. ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌ ( పీపీ–1 నుంచి 5వ వరగతి వరకూ) iv. ప్రీ హైస్కూల్స్‌ ( 3 నుంచి 7లేదా 8వ తరగతి వరకూ) v. హైస్కూల్స్‌ ( 3 నుంచి 10వ తరగతి వరకూ ) vi. హైస్కూల్‌ ప్లస్‌ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ)
  • విద్యార్థులకు ప్రాథమిక దశలోనే మంచి విద్య అందించేలా విప్లవాత్మక చర్యలు
  • ఏ తరగతికి అయినా తెలుగు తప్పనిసరిగా ఉంటుంది
  • రాష్ట్రంలో కొత్తగా 4,800 తరగతి గదుల నిర్మాణం
  • నేతన్న నేస్తానికి 200 కోట్ల రూపాయలు కేటాయింపు
  • ఆగస్టు 10న 3వ విడుత నేతన్న నేస్తం
  • 20 వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులకు ఈనెల 24న చెల్లింపులు
  • ఈ నెల 14న విద్యాకానుక పంపిణీ
  • అభ్యంతరం లేని భూముల్లో ఆక్రమణల క్రమబద్దీకరణకు ఆమోదం
  • రాజమహేంద్రవరం అర్బర్ డెవలప్‌మెంట్ అథారటీ ఏర్పాటు
  • ఇకపై కాకినాడ డెవలప్‌మెంట్ అథారటీగా గోదావరి అర్బన్ డెవలప్ అథారటీ

కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు మంత్రి పేర్ని నాని. నాడు-నేడు ద్వారా పాఠశాలల్ని అభివృద్ధి చేసినట్టు వెల్లడించారు. నాడు-నేడు కింద 34 వేల పాఠశాలలను అభివృద్ధి చేశామన్నారు. ఈనెల 16న విద్యాకానుక పంపిణీ చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఆగస్టు 10 నుంచి మూడో విడత నేతన్న నేస్తం అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. నేతన్న నేస్తానికి 200 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇప్పటికే 238 కోట్లు చెల్లించామన్న పేర్ని.. 20 వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఈనెల 24న చెల్లింపులు చేస్తామన్నారు. రాజమహేంద్రవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని కాకినాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీగా మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది కేబినెట్‌. అభ్యంతరం లేని భూముల్లో ఆక్రమణల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపింది.

Also Read: Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ‘జబర్దస్త్’ లేడీ.. ఎవరో తెలుసా..?

ఒంగోలు రిమ్స్‌లో దారుణం.. కాంట్రాక్ట్‌ నర్సుపై పేషెంట్‌ బంధువు లైంగిక దాడి