నయా మోసం.. కంపెనీనే బురిడి కొట్టించిన ఫ్లిప్‌కార్ట్ డెలివరి బాయ్స్. వీరి స్కెచ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది.
FlipKart Boys Cheating: ఆన్‌లైన్ షాపింగ్ విస్తృతితో పాటు మోసాలు కూడా అదే స్థాయిలో పెరగుతున్నాయి. ఆన్‌లైన్‌లో ఫోన్‌ను ఆడర్ చేస్తే రాళ్లు వచ్చిన సందర్భాలు మనం...
FlipKart Boys Cheating: ఆన్‌లైన్ షాపింగ్ విస్తృతితో పాటు మోసాలు కూడా అదే స్థాయిలో పెరగుతున్నాయి. ఆన్‌లైన్‌లో ఫోన్‌ను ఆడర్ చేస్తే రాళ్లు వచ్చిన సందర్భాలు మనం అడపాదడపా చూసే ఉంటాయి. కానీ తాజాగా కరీంనగర్‌లో వెలుగులోకి వచ్చిన ఓ ఘరనా మోసం ఫ్లిప్‌కార్టు యాజమాన్యాన్నే షాక్‌కి గురి చేసింది. కస్టమర్లను కాకుండా ఏకంగా ఫ్లిప్‌కార్ట్‌ను మోసం చేశారు నలుగురు యువకులు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలానికి చెందిన నీర్ల కళ్యాణ్, అనగోని వికాస్, అనిల్, వినయ్‌లు హుజూరాబాద్ పట్టణంలోని లార్జ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపనీలో ఫ్లిప్‌కార్ట్ కొరియర్ బాయ్స్‌గా పని చేస్తున్నారు. జల్సాలకు అలవాటు పడిన వీరు ఈజీ మనీ కోసం ఓ స్కెచ్ వేశారు.
ఇందులో భాగంగా యూట్యూబ్‌లో మోసం ఎలా చేయవచ్చో వెతికిన ప్రబుద్ధులు ఒక ప్రణాళికను రచించారు. వీరి దందా సాగిందిలా.. వీరు ముందుగా వారి స్నేహితులు లేదా తెలిసిన వారి పేరు మీద ఆన్‌లైన్‌లో ఓ ప్రాడక్ట్‌ను బుక్ చేసుకుంటారు. అనంతరం.. ఆ వస్తువు హుజూరాబాద్‌లోని ఫ్లిప్‌కార్ట్ హబ్‌కు రాగానే వాటిని డెలివరీ కోసం వారి పేరుపై అసైన్ చేసుకొని సైదాపూర్‌కు తీసుకు వెళ్లేవారు. అనంతరం బుకింగ్ చేసిన వారి స్నేహితులకే ఫోన్ కాల్ చేసి.. ఆర్డర్‌ను రిజెక్ట్ చేయించేవారు.
ఇక కంపెనీకి రిటర్న్ ఇచ్చే ముందు ఆ పార్సిల్‌ను తెలివిగా తెరిచి అందులోని వస్తువులను దొంగిలించి. అందులో మళ్లీ అంతే బరువు ఉండే రాళ్ల వంటివి పెట్టి కంపెనీకి పంపించేవారు. ఇలా దొంగలించిన వస్తువులను అమ్ముకొని జల్సాలు చేసేవారు. ఇలాంటి కేసులు తరచూ నమోదవుతుండడంతో హుజూరాబాద్ హబ్‌కి టీం లీడర్‌గా పని చేస్తున్న ముప్పు నవీన్‌కు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు విచారణలో ఈ నలుగురు ఇలాంటి చాలా మోసాలకు పాల్పడ్డారని తేలింది.
Viral Video: బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా హవా మాములుగా లేదుగా.. మరో వధువు స్టెప్పులు అదుర్స్..
స్టార్ హీరోకు ఝలక్ ఇచ్చిన దొంగలు.. సినిమా స్టైల్లో కారు చోరి.. టెక్నాలజీని వాడడంలో వీళ్లు వీరలెవల్..