Tank Bund: మరింత హాయిగా హైదరాబాద్ ట్యాంక్ బండ్.. ఆర్నెళ్లుగా చేపట్టిన బ్యూటిఫికేషన్.. నో ట్రాఫిక్‌తో ఫుల్ హ్యాపీ
హైదరాబాద్ టూరిస్ట్ స్పాట్స్ అంటే చార్మినార్ ఎలా గుర్తొస్తుందో ఆ తరువాత గుర్తొచ్చేది ట్యాంక్ బండ్. పైగా ట్యాంక్ బండ్‌కి సందర్శకుల తాకిడి చాలా ఎక్కువ.
Hyderabad: హైదరాబాద్ టూరిస్ట్ స్పాట్స్ అంటే చార్మినార్ ఎలా గుర్తొస్తుందో ఆ తరువాత గుర్తొచ్చేది ట్యాంక్ బండ్. పైగా ట్యాంక్ బండ్‌కి సందర్శకుల తాకిడి చాలా ఎక్కువ. హుస్సేన్ సాగర్ కి చుట్టూ కూడా నగర సుందరీకరణలో భాగంగా ఎంతో అభివృద్ధి చేశారు. హుస్సేన్ సాగర్‌కి ఒక పక్క ట్యాంక్ బండ్ ఇంకో పక్క నెక్లెస్ రోడ్ అటు వైపు ఎన్టీఆర్ మర్గ్ లుంబిని పార్క్, ఇటు పైపు సుందరయ్య పార్క్ ఇలా అన్ని వైపుల బ్యూటిఫుల్ వ్యూ.
లేక్ మధ్యలో బుద్ధిడి విగ్రహం స్పెషల్ అట్రాక్షన్. పర్యాటకులను మరింతగా ఆకర్షించడానికి ట్యాంక్ బండ్ ని విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. చల్లటి సాయంత్రం ఈ వ్యూ ని ఎంజాయ్ చేయటానికి విజిటర్స్ ఎక్కువగా వస్తుంటారు. అయితే ట్యాంక్ బండ్ రూట్ హైదరాబాద్ సికింద్రాబాద్ ని లింక్ చేసే ప్రధాన మార్గం అవ్వటంతో వాహనాల తాకిడి కూడా చాలా ఎక్కువ. సందర్శకులకు ఇది ఇబ్బందిగా మారటంతో ఇవాళ్టి నుంచి సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.
నగర వాసుల విజ్ఞప్తి మేరకు ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుంచి 10 వరకు ట్యాంక్ బండ్‌ని నో ట్రాఫిక్ జోన్ గా మార్చారు. ఈ ఆదివారం నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. దీంతో పర్యటకులు ట్యాంక్ బండ్ వ్యూ ని ఎలాంటి భయం లేకుండా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నిర్ణయం పై సందర్శకులు హర్షం వ్యక్తం చేశారు.