Murder: కూతురుని వేధిస్తున్నాడని.. ప్లాన్.. బైక్ వెనకాల కూర్చుని యువకుడి గొంతుకోసిన తండ్రి..
young man killed: కూతురిని లైంగికంగా వేధిస్తుండటంతో.. ఆ తండ్రి తట్టులేకపోయాడు. కేసు పెట్టినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే ప్లాన్ రంచించాడు. మాట్లాడుకుందామంటూ ఆ యువకుడిని పిలిపించాడు. ఇద్దరూ కలిసి
young man killed: కూతురిని లైంగికంగా వేధిస్తుండటంతో.. ఆ తండ్రి తట్టులేకపోయాడు. కేసు పెట్టినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే ప్లాన్ రంచించాడు. మాట్లాడుకుందామంటూ ఆ యువకుడిని పిలిపించాడు. ఇద్దరూ కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో వెనుక కూర్చున్న యువతి తండ్రి.. వేధింపులకు పాల్పడుతున్న యువకుడి గొంతుకోసి హత్యచేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కూతురిని లైంగికంగా వేధిస్తున్న వ్యక్తిని ఆమె తండ్రే హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాలు.. షారూఖ్ అనే యువకుడు తన కుమార్తెను వేధిస్తున్నాడని సయ్యద్ అన్వర్ గతేడాది పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. పోక్సో చట్టం కింద కేసు సైతం నమోదైంది. అయిన పద్ధతి మార్చుకోని షారూఖ్ మళ్లీ వేధింపులకు పాల్పడ్డట్లు అన్వర్ పేర్కొన్నాడు. తన కూతురిని పెళ్లి చేసుకున్నానని, కాపురానికి పంపాలని పలుమార్లు అసభ్యకరంగా మాట్లాడంటూ పోలీసులకు అన్వర్ వివరించాడు.
ఈ క్రమంలో పథకం ప్రకారం మాట్లాడుకుందామని అన్వర్.. షారూఖ్ ను పిలించాడు. ఇద్దరూ ద్విచక్రవాహనంపై వెళుతున్న సమయంలో.. వెనుక కూర్చున్న అన్వర్ అదునుచూసి షారుఖ్ గొంతుకోశాడు. ద్విచక్రవాహనం దిగి కొంతదూరం పరుగెత్తిన షారూఖ్ ఫలక్‌నుమా బస్‌డిపో సమీపంలో మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా షారుఖ్‌ను హత్యచేసింది అన్వరేనని గుర్తించారు. ఈ మేరకు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: