Crime: కన్న కూతురిపై తండ్రి అసభ్యకర ప్రవర్తన… పోక్సో కేసు నమోదు…
సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఇది. కంటికి రెప్పలా కాపాడుకునే కన్నతండ్రే చిన్నారి బతుకును చిదిమేయాలని చూశాడు. వావి వరసలు మరిచి, మదంతో కళ్లు మూసుకుని పోయిన కామ పిశాచి కన్న బిడ్డనే కాటేయజూశాడు. కన్న కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ నీచపు...

సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఇది. కంటికి రెప్పలా కాపాడుకునే కన్నతండ్రే చిన్నారి బతుకును చిదిమేయాలని చూశాడు. వావి వరసలు మరిచి, మదంతో కళ్లు మూసుకుని పోయిన కామ పిశాచి కన్న బిడ్డనే కాటేయజూశాడు. కన్న కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ నీచపు తండ్రి పై ఫోక్సో కేసు నమోదు అయిన ఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో చోటుచేసుకుంది. మండలంలోనీ ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికపై తన కన్నతండ్రే అసభ్యకరంగా ప్రవర్తించాడు.
తండ్రి ప్రవర్తనను తల్లికి తెలిపినా ఎలాంటి స్పందన లేకపోవడంతో చివరికి తన బాధను పెద్దమ్మకు చెప్పుకుంది. బాలిక పెద్దమ్మ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాలికను బాలల సంరక్షణ అధికారులకు అప్పగించినట్లు దేవరుప్పుల ఎస్సై సృజన్ కుమార్ తెలిపారు. వారం రోజుల వ్యవధిలోనే పాలకుర్తి సర్కిల్ పరిధిలో రెండో పోక్సో కేసు నమోదు కావడం స్థానికంగా కలకలం రేపింది. నేరస్థులను కఠినంగా క్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు




