Telangana: అయ్యో ఎంత కష్టమొచ్చిందో..! నా చావుకు భార్య, అత్త, ఆ స్టేషన్ సీఐనే కారణం.. పాపం యువకుడు..
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన చావుకు తన భార్య, అత్తతో పాటుగా కరీంనగర్ మహిళ పోలిస్ స్టేషన్ సీఐ కారణమంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. గడ్డిమందు తాగి అత్మహత్యయత్నానికి పాల్పడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన చావుకు తన భార్య, అత్తతో పాటుగా కరీంనగర్ మహిళ పోలిస్ స్టేషన్ సీఐ కారణమంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. గడ్డిమందు తాగి అత్మహత్యయత్నానికి పాల్పడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన కడారి శ్రవణ్ కుమార్ అనే యువకుడికి కరీంనగర్ చెందిన ఓ యువతితో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.. కొన్నాళ్ల తర్వాత వారి మనస్ఫర్థలు వచ్చాయి.. దీంతో శ్రవణ్ భార్య కరీంనగర్ మహిళ పోలీసు స్టేషన్‌లో గృహహింస, వరకట్నం కేసులు పెట్టింది. ఈ క్రమంలో పోలీసులు శ్రావణ్ ను విచారించారు.
అయితే, విచారణ పేరుతో తనను వేధిస్తున్నారని శ్రవణ్ కుమార్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.. కుటుంబ కలహాల నేపథ్యంలో తనను భార్య, అత్తతో పాటుగా కరీంనగర్ మహిళ టౌన్ సిఐ మరికొంత మంది కలిసి ఇబ్బందులకి గురిచేస్తున్నారని.. కరీంనగర్ సీపీకి తన బాధని వివరిస్తూ సెల్ఫీ వీడియో రికార్డు చేసాడు. తనపై ఎకపక్షంగా మహిళ సిఐ తప్పుడు కేసు పెట్టారని, తాను చనిపోయినా తరువాత అయినా నిజాలు తెలుసుకోవాలని.. అసలైన దోషులని అరెస్టు చేయాలని వీడియోలో కోరాడు.. అనంతరం గడ్డి మందు తాగాడు..
అయితే.. క్రిమిసంహారక గడ్డి మందు తాగిన శ్రావణ్ ను కుటుంబసభ్యులు హుటా హుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడు రోజులుగా అసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రావణ్ కుమార్ నిన్న రాత్రి మృతిచెందాడు.. తన కొడుకు భార్య, అత్త, మహిళ పోలీసు స్టేషను సిఐ వేధింపుల వలనే క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడని.. తన కొడుకు వీడియోలో మొత్తం వివరాలను తెలిపాడని శ్రావణ్ తల్లి చెప్పారు. దీని ఆధారంగా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుని సోదరి, తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు సీఐపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




