Andhra Pradesh: ఫేక్‌లోన్‌ యాప్‌ ముఠా అరెస్ట్.. కేటుగాళ్లకు చెక్ పెట్టిన పోలీసులు..

ఇలా అప్పిచ్చి.. అలా ప్రాణం తీసుకోడానికి మారు పేరుగా మారిన లోన్ యాప్‌లు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ కేటుగాళ్ల ఆట కట్టించారు ఏలూరు జిల్లా పోలీసులు. ఫేక్‌లోన్‌ యాప్‌ ముఠాను అరెస్ట్ చేశారు.

Andhra Pradesh: ఫేక్‌లోన్‌ యాప్‌ ముఠా అరెస్ట్.. కేటుగాళ్లకు చెక్ పెట్టిన పోలీసులు..
arrest
Follow us

|

Updated on: Oct 04, 2022 | 6:30 AM

రోజురోజుకు లోన్‌యాప్‌ రుణాలకు బలి అవుతోన్న ప్రాణాలు ఎన్నో.. అయితే ఇలాగే ఫేక్ లోన్‌ యాప్‌తో నగరంలో దందాకు దిగిన ఓ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి దగ్గర 33 ఎకౌంట్‌లలో 48 కోట్ల రూపాయలు డిపాజిట్ అయినట్లు గుర్తించారు. ఐదుగురు నిందితుల్లో ముగ్గరు తమిళనాడుకు చెందిన వారు కాగా ఇద్దరు హైదరాబాద్, వైజాగ్‌కు చెందిన వారు ఉన్నారు.

బ్యాంక్ ఎకౌంట్‌ను నిందితులు 0.5 కమిషన్‌కు అమ్మేశారు. అయితే ఆయా అకౌంట్‌లలో బాధితులు కట్టే సొమ్ము ఈ కేటుగాళ్లకు వెళ్తుంది. ఏలూరులోని గుడివాకలంకకు చెందిన నాగేంద్ర మూర్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. అయితే ఈ ముఠా వెనుక ఇంకా చాలా మంది ఉన్నారని ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ రాహుల్ తెలిపారు.