AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తన భార్యపై మోజు పడ్డాడని.. ప్రైవేట్‌ పార్ట్స్‌పై తన్ని.. మృతదేహంపై నిల్చోని.. పెద్దపల్లిలో దారుణ హత్య!

పెద్దపల్లిలో ఓ భర్త తన భార్యతో చనువుగా ఉంటున్నాడని భావించి తన బావను దారుణంగా హత్య చేశాడు. క్షణికావేశంలో కత్తితో పొడిచి చంపి, మృతదేహంపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. భార్య కళ్లముందు జరిగిన ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు నిర్ధారించారు.

తన భార్యపై మోజు పడ్డాడని.. ప్రైవేట్‌ పార్ట్స్‌పై తన్ని.. మృతదేహంపై నిల్చోని.. పెద్దపల్లిలో దారుణ హత్య!
Murder
G Sampath Kumar
| Edited By: |

Updated on: May 01, 2025 | 9:41 PM

Share

తన భార్యతో చనువుగా ఉంటున్నాడంటూ ఓ భర్త, తన తోడళ్ళుడిని దారుణంగా హత్య చేశాడు. కసితీర కత్తితో పొడిచి పొడిచి చంపాడు. రక్తంమడుగులో పడిపోయిన వ్యక్తి మర్మాంగాలపై తన్ని శవంపై నిల్చుండి పైశాచికంగా ప్రవర్తించాడు. ఈ దారుణ ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది. క్షణికావేశంతో చేసిన హత్యతో భార్యభర్తలు ఇద్దరు ఇప్పుడు కటకటాలు లెక్కించాల్సి వచ్చింది. పత్తిమార్కెట్ యార్డులో అందరు చూస్తుండగానే టాక్టర్ డ్రైవర్ గా పని చేసే అప్పన్నపేటకు చెందిన పొలం కుమార్ ను వరసకు తోడళ్ళుడు అయ్యే వేల్పుల సంతోష్ కుమార్ దారుణంగా హత్య చేశాడు. భార్య కళ్ళెదుటే కత్తితో కసితీరా పొడిచి ప్రాణాలు తీశాడు. రక్తంమడుగులో పడి ఉన్న బావను చూసి నిందితుడి భార్య శైలజ సొమ్మసిల్లి పడిపోయింది.

మార్కెట్ లో జరిగిన దారుణ హత్యను చూసిన వారు వారించే ప్రయత్నం చేయగా కత్తితో బెదిరించాడు నిందితుడు. అనంతరం మృతదేహం పక్కనే ఉన్న గద్దెపై కూర్చుండిపోయాడు. స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దారుణ హత్యను కళ్ళారా చూసి సొమ్మసిల్లి పడిపోయిన మరదలు శైలజను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన తర్వాత ఆమెను కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు గురైన కుమార్ కు అనితతో వివాహం కాగా వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య పిల్లలతో పెద్దపల్లిలో నివాసం ఉంటున్న కుమార్ తన భార్య అనిత చిన్నమ్మ కూతురు శైలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

అది కాస్త భర్త ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన వేల్పుల సంతోష్ కు తెలిసింది. ఈ విషయం తెలిసి సంతోష్ తట్టుకోలేక పోయాడు. ఈ విషయమై కుమార్ తో గొడవకు దిగాడు. కొంతకాలంగా గొడవలు జరుగుతున్నా కుమార్ ప్రవర్తనలో తేడా కనిపించలేదు. బావే తన వెంటపడుతున్నాడని శైలజ భర్తకు చెప్పింది. ఇంకోసారి శైలజ వెంటపడొద్దని కుటుంబసభ్యులతోపాటు బంధువులు కూడా హెచ్చరించారు. కానీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం రహాస్యంగా సాగుతూనే ఉంది. ఈ విషయం శైలజ భర్తకు తెలియడంతో భార్యను నిలదీయగా బావే తన వెంటపడుతున్నాడని మరోసారి భర్తకు చెప్పడంతో రగిలిపోయిన సంతోష్.

మాట్లాడుకుందాం రా.. అని మార్కెట్ యార్డుకు కుమార్ ను శైలజ ద్వారా పిలిపించాడు సంతోష్. శైలజతో కలిసి సంతోష్ మార్కెట్ యార్డుకు చేరుకుని కుమార్ రాగానే పథకం ప్రకారం సంతోష్ కత్తితీసి పొడిచాడు. తన భర్తను చెల్లెలు వరుస అయ్యే శైలజే కారణమని మృతుడు కుమార్ భార్య అనిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంట్లో ఉండగా ఫోన్ రావడంతో కుమార్ బయటకు వెళ్ళాడని, ఎక్కడి వెళ్తున్నావ్‌ అని అడగ్గా.. సంతోష్ శైలజ మాట్లాడుతారట అని చెప్పి బయటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడని అనిత వాపోయింది. అనిత ఫిర్యాదుతో పోలీసులు సంతోష్ తోపాటు అతని భార్య శైలజను అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని డీసీపీ కరుణాకర్ తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి